close

తాజా వార్తలు

గోదారమ్మంటే అభిమానం

రెండేళ్లుగా నది మధ్యలో ధనుష్‌ పుట్టినరోజు వేడుకలు
ఈసారి వెళ్లి తిరిగి రాని వైనం

ఈనాడు, అమరావతి: ధనుష్‌కు గోదావరి అంటే చెప్పలేనంత అభిమానం... అన్నా! నా పుట్టిన రోజు వేడుకను నది మధ్యలోనే చేసుకుంటా అని స్నేహితులతో ఎప్పుడూ చెబుతుంటారు. అందుకు అనుగుణంగానే వారు రెండేళ్లుగా గోదావరి నదిపై వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న విశ్వమానవ వేదిక ఆధ్వర్యంలో వృద్ధుల విహార యాత్ర చేపట్టి... జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు. నర్సాపురంలోని ఎంబెర్‌మనార్‌ కోవెల కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్న ధనుష్‌ చిన్ననాటి నుంచే గోదావరిపై ఎంతో మమకారం చూపించేవారు. నదిని రక్షించుకుందాం, కాలుష్యాన్ని కట్టడి చేద్దామంటూ పలుసార్లు ప్రదర్శనలు, ప్రతిజ్ఞలు చేశారు.  ధనుష్‌ ఆదివారం మరో ముగ్గురితో కలిసి బోటులో బయల్దేరారు. ప్రమాదంలో వీరిలో ఒకరు బయట పడగా రాగా.. ధనుష్‌తోపాటు మరో ఇద్దరు గల్లంతయ్యారు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైన ధనుష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
Saket Pranamam
dr madhu
tsmbanner
besttaxfiler
VITEEE 2020

Panch Pataka

దేవతార్చన