close

తాజా వార్తలు

‘కోటయ్య’కు అపర భక్తుడు కోడెల

 కోటప్పకొండ అభివృద్ధికి ఎనలేని కృషి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్ర్యతేకం: మాజీ స్పీకర్‌ దివంగత కోడెల శివప్రసాదరావుకు కోటప్ప కొండపై వెలసిన త్రికోటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి. ఆయన హయాంలో కోటప్పకొండ రూపురేఖలే సమూలంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కోటప్పకొండ ఏపీలోనే ప్రముఖ పర్యాటక స్థలంగా మారడానికి కోడెల కృషి ఎంతో ఉంది.

ఒకప్పుడు నిర్జన ప్రదేశంగా ఉండే ఈ కొండ శివరాత్రి సమయంలో మాత్రం కోలాహలంగా మారుతుంది. ఆ తర్వాత కార్తీక మాసంలో భక్తులు స్వామి దర్శనానికి ఇక్కడికి వచ్చేవారు. కొండపైకి వెళ్లేందుకు గతంలో మెట్ల మార్గం ఒక్కటే ఆధారం. దీంతో వృద్ధులు, గర్భిణులు కొండపైకి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడం కష్టంగా ఉండేది. దీంతో అక్కడ ఘాట్‌రోడ్డు నిర్మించాలని నాటి నరసరావుపేట శాసన సభ్యుడు కోడెల శివప్రసాద్‌ సంకల్పించారు. దీంతో రూ.66.50 లక్షల వ్యయంతో 1986 ఏప్రిల్‌ 9న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుతో శంకుస్థాపన చేయించారు. కానీ, పరిస్థితులు మారడంతో ఆ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 1997లో మరోమారు రూ.2.24  కోట్ల వ్యయంతో రోడ్డు పనులను ప్రారంభించి 1999 నాటికి పూర్తి చేయించారు.  అదే ఏడాది త్రికోటేశ్వర స్వామి ఆలయ, మహారాజ గోపుర నిర్మాణం కూడా  పూర్తి చేయించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆవిష్కరింపజేశారు. క్యూకాంప్లెక్‌, అభిషేక మండపాలు, కాటేజీలు, ప్రసాద తయారీ కేంద్రం, ధ్యాన మందిరం, యాగశాల, నవగ్రహ మండపం ఇలా ఒక యాత్రా స్థలానికి కావాల్సిన సకల ఏర్పాట్లు చేశారు. వృద్ధులు రాజగోపురం మెట్లపై నుంచి ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నారని రెండు లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. 

ఆహ్లాదానికి చిరునామాగా..

ఒకప్పుడు ముళ్లచెట్లతో నిండిన చిట్టడివిని తలపించే కోటప్పకొండ ఇప్పుడు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రదేశంగా మారింది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి సెలవు రోజుల్లో భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతుంటారు.  ఈ కొండపై ధ్యాన శివుడు, త్రిముఖ శివలింగం, విఘ్నేశ్వరుడు, లక్ష్మీనారాయణల భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మార్గ మధ్యలో చిన్నపిల్లలు, పెద్దవారు సేదదీరేలా ఒక పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి పనులు  మొత్తం కోడెల  హయాంలో జరిగినవే. ఫలితంగా త్రికోటేశ్వరస్వామి ఆలయ ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.6కోట్లకు చేరింది. దీనికి తోడు కొండపై రోప్‌వేకు కూడా ఆయన ప్రయత్నించారు. కోడెల నరసరరావు పేట వచ్చిన ప్రతిసారి కనీసం ఒక్కసారి అయిన స్వామి దర్శనం చేసుకుంటారు.

కోడెల మృతి..  లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.