close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల ఇకలేరు

తెదేపా సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఈనాడు - ఈటీవీ ‘చెప్పాలని ఉంది’లో కోడెల ఇంటర్వ్యూ
* కోడెల కన్నుమూత... లైవ్‌ బ్లాగ్‌ 
* ‘కోటయ్య’కు అపర భక్తుడు కోడెల (ప్రత్యేక కథనం)
* ఇష్టం లేకపోయినా.. ఎన్టీఆర్‌ పిలిచారని..!

2. పోస్టుమార్టం తర్వాతే నిర్ధారిస్తాం: డీసీపీ

కోడెలది ఆత్మహత్య? కాదా? అనేది పోస్టుమార్టం తర్వాత నిర్ధారిస్తామని డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. కోడెల ఉరివేసుకున్నారని, ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపినట్లు డీసీపీ తెలిపారు. ఉదయం 11 గంటలకు తన పడక గదిలో పడి ఉన్నారని, భార్య, కుమార్తె, పనిమనిషి ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారని డీసీపీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘వైకాపా వేధింపులతోనే కోడెల బలవన్మరణం’

తెదేపా సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెదేపాతో పాటు వివిధ పార్టీల నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల బలవన్మరణానికి ఏపీ ప్రభుత్వం ఆయన పట్ల వ్యవహరించిన తీరే కారణమని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కోడెల మెడపై గాట్లు ఉన్నాయి: సోమిరెడ్డి

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఉరేసుకొని చనిపోయారని ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని చెప్పారు. శవపరీక్ష కోసం ఆయన భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు. కోడెలను ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారని సోమినేని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యురేనియంపై శాసనసభలో తీర్మానం

నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాకుండా యురేనియం అన్వేషణ కూడా కొనసాగించరాదని తీర్మానం చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్మానం ప్రవేశపెట్టారు. పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికి తీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కోడెల మృతికి సీఎం జగన్‌ సంతాపం

శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి సీఎం జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు.

8. ఆరాంకో ప్లాంట్లపై ఏక్షణమైనా మరిన్ని దాడులు!

సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన ఆరాంకో చమురు క్షేత్రాలపై మరిన్ని దాడులు జరిగే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. ఆరాంకో ప్లాంట్లపై ఏక్షణమైనా దాడులు జరగొచ్చని, విదేశీయులు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని యెమెన్‌ హవుతీ తిరుగుబాటు దారులు హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హమ్మయ్య! దినేశ్‌ కార్తీక్‌కు ఊరట

టీమిండియా వెటరన్‌ క్రికెటర్ దినేశ్‌ కార్తీక్‌ భేషరతుగా కోరిన క్షమాపణలను అంగీకరించామని బీసీసీఐ వెల్లడించింది. ఇక ఈ అంశం ముగిసిన అధ్యాయమని తెలిపింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌ను అతడు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ డ్రస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని వీక్షించాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ అతడికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. నేనే కశ్మీర్‌కు వెళ్తా: సీజేఐ గొగొయి

కశ్మీర్‌లో పరిస్థితులను తెలుసుకోడానికి అవసరమైతే అక్కడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌ హైకోర్టును ఆశ్రయించేందుకు అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలపై జస్టిస్ గొగొయి అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.