close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించారు: చంద్రబాబు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌కు చేరుకున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. కోడెల శివప్రసాదరావును పల్నాడు పులిగా అభివర్ణించారు. ఆయనకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వైకాపా నేతలు కోడెలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ధవళేశ్వరం బ్యారేజీకి కొట్టుకొచ్చిన మృతదేహం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాదానికి సంబంధించి మూడో రోజు గాలిపంపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో మృతదేహం ధవళేశ్వరం బ్యారేజీ 17వ నెంబరు గేటు వద్దకు కొట్టుకొచ్చింది. దీంతో ఇప్పటి వరకు బయటపడిన మృత దేహాల సంఖ్య 10కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. తెరాసలో విస్ఫోటనం తప్పదు

కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌లో గెలిచేందుకు పోలీసుల సాయంతో తెరాస దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో వార్డుకొక మంత్రికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినా.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఇక్కడ కూర్చున్నా.. కాంగ్రెస్‌ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. తెరాసలో త్వరలో భారీ విస్ఫోటనం జరగబోతోందని జోస్యం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మరోసారి పార్టీలోకి రావడం మరపురాని ఘట్టం

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ భావన ఇప్పటికే మారుమూల గ్రామాలకు పాకిందని.. దీన్ని నిజం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు. సోమవారమిక్కడ ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేతులమీదుగా భాజపా సభ్యత్వం స్వీకరించారు. అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. భాజపా తనకు కన్నతల్లి లాంటిదని, మరోసారి పార్టీలోకి రావడం మరపురాని ఘట్టంగా అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. పెళ్లి‘కానుక’ పెరిగింది

వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులైన వధువులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ప్రోత్సాహకం 2, ఏప్రిల్‌ 2020 నుంచి అమల్లోకి వస్తుందని అందులో స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మార్చి నాటికి 2 లక్షల ఇళ్లు పూర్తి

వచ్చే మార్చికల్లా రాష్ట్రంలో రెండు పడకల గదుల ఇళ్లు 2 లక్షలు నిర్మిస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బడ్జెట్‌ పద్దులపై సోమవారం శాసనసభలో చర్చకు బదులిస్తూ 1.99లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తికాగా 1.79లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైందన్నారు. వీటిలో 96,000 ఇళ్ల నిర్మాణం 90శాతం కొలిక్కి రాగా, 34వేల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని సభకు వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 7,944 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా 66,273 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. భవిష్యత్తులో రుణ మాఫీలు వద్దు

భవిష్యత్తులో వ్యవసాయ రుణ మాఫీలు వద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వు బ్యాంకు అంతర్గత కమిటీ సూచించింది. వ్యవసాయానికి తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందువల్ల ఇలాంటి పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వవని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఎడ్ల బండికి రూ.1000 చలానా!

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లో ఆటో డ్రైవర్‌కు సీటు బెల్ట్‌ లేదనో, కారులో వెళ్తూ హెల్మెట్‌ పెట్టుకోలేదనో జరిమానాలు విధిస్తున్న అధికారులు.. తాజాగా ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఓ ఎడ్ల బండి యజమానికి రూ.1,000 జరిమానా విధించారు. దేహ్రాదూన్‌ శివారులోని సహాస్‌పుర్‌లో రియాజ్‌ హసన్‌ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రం వద్ద శనివారం ఎద్దుల బండిని నిలిపి ఉంచారు. పోలీసులు హసన్‌ ఇంటికి వెళ్లి రూ.వెయ్యికి చలానా అందజేశారు. మోటారు వాహనాల చట్టం పరిధిలోకి ఎడ్ల బండి ఎలా వస్తుందని హసన్‌ నిలదీయడంతో  చివరకు చలానాను రద్దుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అమెజాన్‌ పండుగ విక్రయాలు

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని అమెజాన్‌ సంస్థ ఈనెల 29 నుంచి అక్టోబరు 4 వరకు గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ పేరిట భారీ డిస్కౌంట్‌ అమ్మకాలు జరపనుంది. ప్రైమ్‌ సభ్యులు ఈనెల 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి, సాధారణ వినియోగదారులు 29 ఉదయం 11.59 గంటల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు వీలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సింధు, సైనాలకు సవాల్‌

భారత స్టార్‌ క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌లకు చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో కఠినమైన సవాల్‌ ఎదురుకానుంది. మంగళవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డ్రా ప్రకారం సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉన్నారు. మరోవైపు తెలుగు జిమ్నాస్ట్‌ అరుణ బుడ్డారెడ్డి ప్రపంచ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడే ఆరుగురు సభ్యుల భారత జట్టుకు ఎంపికైంది. ఆశిష్‌, యోగేశ్వర్‌, ఆదిత్య, ప్రణతి నాయక్‌, ప్రణతి దాస్‌ ఇతర సభ్యులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.