close

తాజా వార్తలు

హంసలదీవిలో తిరగబడిన పడవ

కోడూరు: నలుగురు మత్స్యకారులతో సముద్రంలో వేటకు వెళ్లిన పడవ సముద్ర అలల దాటికి తిరగబడి పోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి వద్ద సాగరసంగమ సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బందరు మండలం మంగినిపూడికి చెందిన నలుగురు మత్స్యకారులు ఒక పడవలో సముద్రంలో వేటకు బయలుదేరి మంగళవారం ఉదయం హింసలదీవి వైపు వచ్చారు. అలల తీవ్రత ఎక్కువ ఉండటంతో పడవ ఒక్కసారిగా తిరగబడిపోయింది. పడవలో ఉన్నది మత్స్యకారులు కావడంతో సురక్షితంగా బయట పడగలిగారు. సముద్రతీరానికి సమీపానే ఈ ఘటన జరగడంతో హంసలదీవి, పాలకాయితిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు గమనించి పడవను బయటకు లాగారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.