close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. ఒక్కొక్కటిగా బయటపడుతున్న మృతదేహాలు

గోదావరి ఘోర ప్రమాద ఘటనలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 16 మృతదేహాలు లభ్యమయ్యాయి. 14 మంది మృతదేహాలు నీటిపైకి తేలగా.. మరో ఇద్దరి మృతదేహాలను సిబ్బంది గుర్తించారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ వద్ద మరొక మృతదేహం లభ్యమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. భాజపా కార్యాలయంలో విమోచన దినోత్సవం

భాజపా రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు తదితరులు హాజరయ్యారు.

3. హంసలదీవిలో తిరగబడిన పడవ

నలుగురు మత్స్యకారులతో సముద్రంలో వేటకు వెళ్లిన పడవ సముద్ర అలల దాటికి తిరగబడి పోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి వద్ద సాగరసంగమ సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. పడవలో ఉన్నది మత్స్యకారులు కావడంతో సురక్షితంగా బయట పడగలిగారు. సముద్రతీరానికి సమీపానే ఈ ఘటన జరగడంతో హంసలదీవి, పాలకాయితిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు గమనించి పడవను బయటకు లాగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సోలార్‌ విద్యుత్‌ ధర తగ్గడానికి అవే కారణం

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే సోలార్‌ విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. సంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, సోలార్‌ విద్యుత్‌ తదితర అంశాలపై సభ్యులు గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధాన మిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విద్యుత్‌ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మీ దార్శనికత.. మాకు స్ఫూర్తిదాయకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు సహా సామాన్యులు సైతం ట్విటర్‌ వేదికగా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వంలో భారత్‌ సరికొత్త శిఖరాలకు చేరుకుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కావేరి కోసం స్మిత పాట చూశారా?

7. ఒక్క చెక్కు బౌన్స్‌తో కుంభకోణం బయటకు..

ఒక్క చెక్కు బౌన్స్‌తో రూ.3,000 కోట్ల విలువైన కుంభకోణం బయట పడింది. సీజీ పవర్‌లో ఇటీవల జరిగిన అవకతవకలపై వైష్‌ అసోసియేట్స్‌ నిర్వహించిన దర్యాప్తులో పలు ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఉన్నత స్థాయి పదవుల్లోని వ్యక్తులు విచ్చలవిడిగా నిధులను మళ్లించి  కంపెనీలను గుల్ల చేసిన వైనం చూసి దర్యాప్తు సంస్థ కూడా నోరెళ్లబెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. నా ప్రసంగానికి మీ సూచనలివ్వండి: మోదీ

అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా జరగబోయే ‘హౌదీ-మోదీ’ కార్యక్రమానికి ఎంతో ఆత్రతుగా చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించి దేశ ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని ట్విటర్‌ వేదికగా కోరారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌, పాక్‌ ప్రధానులను కలుస్తా: ట్రంప్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీని త్వరలో కలవనున్నానని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అలాగే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో కూడా భేటీ అవుతానన్నారు. శ్వేతసౌధంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించకుండానే భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల తగ్గుదల విషయంలో పురోగతి జరిగిందని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 300, నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.81గా ఉంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.