close

తాజా వార్తలు

గోదావరి ఘటనలో 26 మృతదేహాలు లభ్యం

రాజమహేంద్రవరం: గోదావరి బోటు ప్రమాదంలో వరుసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఇప్పటి వరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తంగా 26 మృతదేహాలు బయటపడ్డాయి. మూడో రోజు వివిధ ప్రదేశాల్లో ఒక్కొక్కటిగా కొట్టుకొస్తున్నాయి. బోటు మునిగిన ప్రాంతంలోనే ఎక్కువగా తేలుతున్నాయి. ఇవాళ కేవలం దేవీపట్నం వద్దే 12 మంది మృతులను గుర్తించారు.
మరోవైపు మంగళవారం ఉదయం ధవళేశ్వరం బ్యారీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ వద్ద మరొక మృతదేహం లభ్యమైంది. మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించిన పోలీసులు.. అతడిని హైదరాబాద్‌లోని మాదాపూర్‌ వాసి ఇ. సాయికుమార్‌గా గుర్తించారు. పోలవరం ఇసుక రేవు వద్ద ఒక మృతదేహం బయటపడగా.. కచ్చులూరు, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఒక్కో మృతదేహాన్ని గుర్తించారు. 

తాళ్లపూడి వద్ద ఒకటి, ధవళేశ్వరం వద్ద మరో మృతదేహం లభ్యమైంది. 17వ నెంబరు గేటు వద్ద లభ్యమైన మృతదేహాన్ని బోటు ప్రమాద మృతుడిగా అధికారులు భావిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

315 అడుగుల లోతులో బోటు!

ప్రమాదానికి గురైన బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్లు  గుర్తించారు. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఎక్కువగా ఉన్నందున సహాయక చర్యలకు తీవ్ర ప్రతికూలంగా మారిందని అధికారులు చెబుతున్నారు. సుడిగుండాలు, వరద ఉద్ధృతితో సహాయక బోట్లు నిలవలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికి 21 మంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారి కోసం విస్త్రృతంగా గాలింపు చేపడుతున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ అధికారులతో సహా బ్యారేజీ వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.