close

తాజా వార్తలు

700కిలోల కేకుతో మోదీ జన్మదిన వేడుకలు!

సూరత్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినాన్ని భాజపాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బేకరీ వ్యాపారులు సైతం ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. అటల్‌ బేకరీ అనే ఓ దుకాణ నిర్వాహకులు 700 అడుగుల పొడవైన 7వేల కేజీల కేకుతో మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా దుకాణ యజమాని వెకారియా మాట్లాడుతూ.. ‘కేకును సర్సన వేడుక శాలలో 700 మంది నిజాయతీ పరులైన వ్యక్తులతో కట్‌ చేయిస్తాం. అనంతరం ఈ ఆహారపదార్థాన్ని గిరిజన జిల్లాల్లోని 370 పాఠశాలల్లోని 12వేల మంది చిన్నారులకు పంచుతాం. దీని ద్వారా పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తాం. అంతేకాకుండా అవినీతి నిర్మూలన అనే ఆలోచనతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఇంతేకాకుండా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినందుకు 370 విభిన్న ప్రాంతాల్లో 370 కేకులను కోయనున్నట్లు’ ఆయన తెలిపారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.