close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. కోడెలకు అభిమానుల అశ్రు నివాళి

తెదేపా సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌రావు పార్థివదేహాన్ని నరసరావుపేటలోని తన స్వగృహంలో ఉంచారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. కోడెల భౌతికకాయానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కరణం బలరాం, బుచ్చయ్యచౌదరి తదితరులు నివాళులు అర్పించారు.  గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నెలలో అయోధ్య కేసు విచారణ పూర్తి!

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ కొనసాగించింది. అక్టోబరు 18తో వాదనలు ముగుస్తాయని ధర్మాసనం పేర్కొంది. అదే రోజున విచారణ కూడా పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అక్టోబరు 18 నాటికి ఈ కేసు విచారణ పూర్తిచేయనివ్వాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ కోరారు. అదే రోజున కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసే అవకాశం ఉంది. నవంబర్ 17న సీజే రంజన్‌ గొగొయ్‌ పదవీకాలం ముగియనుంది. ఈ లోపు అయోధ్య వివాదంపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపా, శివసేన పొత్తు ఉన్నట్టా?లేనట్టా?

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఇప్పటికే అక్కడ కాంగ్రెస్‌, ఎన్సీపీలు జట్టు కట్టాయి. కానీ, శివసేన-భాజపా మైత్రిపై మాత్రం స్పష్టత లేదు. భాజపాపై పరోక్ష విమర్శలు చేస్తూ చివరి క్షణంలో కలిసిపోయే శివసేన ఈ సారి మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 288 స్థానాల్లో ఒంటి చేత్తో గెలవాలని రెండు రోజుల క్రితం శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే పార్టీ శ్రేణులకు సూచించడం దీనికి ఊతమిస్తోంది. ఎన్నికలయ్యే వరకు విశ్రమించవద్దని, పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఉద్ధవ్‌ ఉద్బోధ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘భారత్‌కు జీఎస్పీ హోదా పునరుద్ధరించండి’

భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదాను పునరుద్ధరించాలని అమెరికన్‌ చట్టసభలకు చెందిన 44మంది ప్రతినిధులు ట్రంప్‌ పాలకవర్గాన్ని కోరారు. ఈ మేరక వారు మంగళవారం ట్రంప్‌ ప్రభుత్వంలోని వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌ హైజర్‌కు లేఖను అందజేశారు. గత జూన్‌లో జీఎస్పీ లబ్ధిదారుల జాబితా నుంచి భారత్‌ను తొలగించిన విషయం తెలిసిందే. భారత్‌తో తదుపరి జరపాల్సిన చర్చల్లో జాప్యం ద్వారా అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ సతీమణికి దీదీ కానుక

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్‌ను కలిశారు. మోదీని కలిసేందుకు మమత దిల్లీకి ప్రయాణమవుతుండగా కోల్‌కతా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ వెళుతూ.. జశోద కూడా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. ఈ  సందర్భంగా మోదీ సతీమణికి మమత ఒక చీరను బహుమతిగా ఇచ్చినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. మమత ఈరోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ శూన్యాన్ని ఉగ్రవాదులు పూడ్చుతారు: రాహుల్‌

జమ్మూకశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా వంటి నేతలను పక్కనబెట్టి రాజకీయ శూన్యం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తద్వారా ఆ శూన్యాన్ని ఉగ్రవాదులు పూడ్చేస్తారని అప్పుడు కశ్మీర్‌ని అవకాశవాద రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాను కఠినమైన ప్రజా భద్రత చట్టం(సీఎస్‌ఏ) కింద అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే వివిధ పార్టీల నేతలు కూడా ఫరూక్‌ అబ్దుల్లా అరెస్టుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చైనా ఓపెన్‌లో సైనాకు షాక్‌

‘చైనా ఓపెన్‌ సూపర్‌ 1000’ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు షాక్ తగిలింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 8వ ర్యాంక్‌ క్రీడాకారిణి సైనాపై 19వ ర్యాంకర్‌ బుసానన్‌ తొలి నుంచి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో 10-21తో తేలిపోయిన సైనా.. రెండో గేమ్‌లో బుసానన్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దీంతో 10-21, 17-21తో సైనా పరాజయం పాలైంది. బుసానన్‌ చేతిలో సైనా ఓడిపోవడం వరుసగా ఇది రెండోసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఇందల్వాయి పోలీసు స్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రకాశ్‌ రెడ్డి.. ఎస్సై రివాల్వర్‌తో తలలో కాల్చుకున్నాడు. దీంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. సమాచారమందుకున్న వెంటనే సీపీ కార్తికేయ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పెళ్లైందనే విషయం మర్చిపోయిన దీపిక

దీపికా పదుకొణె, రణవీర్‌సింగ్‌ బాలీవుడ్‌లోనే ఓ అందమైన ప్రేమజంట. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దీపికా తనకు వివాహమైందనే విషయాన్ని మరిచిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీపికా ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ అనే ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీపికా నిత్యజీవితంలో తాను పోషించే పాత్రలను గురించి మాట్లాడుతూ.. ‘ఒక కూతురిగా, ఒక సోదరిగా, ఒక నటిగా’ అని ఆగిపోయారు. వెంటనే పక్కనే ఉన్న మరో మహిళ ఒక భార్యగా అని చెప్పగానే.. ‘అవును.. ఒక భార్యగా కూడా.. ఓ మైగాడ్‌ నేను మర్చిపోయాను’ అని దీపికా అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 45 కప్పుల తేనీరు.. 9 నిమిషాల్లో తాగేశాడు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.