close

తాజా వార్తలు

కోడెల అంతిమయాత్ర ప్రారంభం

నరసరావుపేట: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు అంతిమయాత్ర ప్రారంభమైంది. నరసరావుపేట కోట సెంటర్‌లోని ఆయన స్వగృహం నుంచి ఈ యాత్ర మొదలైంది. తెదేపా యువనేత నారా లోకేష్‌ కోడెల భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ అంతిమయాత్రలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడులోని అన్ని ప్రాంతాల నుంచి అంతిమయాత్రకు తరలివచ్చిన జనసందోహంతో కోటసెంటర్‌ కిక్కిరిసిపోయింది. గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో ఇప్పటికే ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.