close

తాజా వార్తలు

న్యూజెర్సీతో తెలంగాణ ఒప్పందం

హైదరాబాద్‌: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. విద్య, వాణిజ్య, వ్యాపార రంగాల్లో పరస్పరం సహకారం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పదంపై సీఎస్‌ జోషి, న్యూజెర్సీ గవర్నర్‌ ఫిలిప్‌ మార్ఫీ సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా న్యూజెర్సీ గవర్నర్‌ మాట్లాడుతూ తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలుగు వారు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో న్యూజెర్సీ కూడా ఒకటన్నారు. ఈ కొత్త ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.