close

తాజా వార్తలు

గవర్నర్‌గా కాదు..వైద్యురాలిగా హాజరయ్యా!

హైదరాబాద్‌: అంతర్జాతీయ బ్లడ్ ఫ్యూరిఫికేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 38వ అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగరం వేదికైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. సొసైటీ ఎలక్టివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాయక్, ప్రెసిడెంట్ డాక్టర్ హిదైకి కవాషిని, సెక్రటరీ డాక్టర్ రషీద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. తాను గవర్నర్ గా కాకుండా.. ఓ వైద్యురాలిగా సదస్సుకి హాజరయ్యానని పేర్కొన్నారు. పెరిటోనియల్ డయాలసిస్ వంటి అత్యాధునిక చికిత్సలు రక్త శుద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని.. అలాంటి చికిత్సను పేదలకు చేరువ చేసేందుకు దివంగత మహిళా నాయకులు సుష్మాస్వరాజ్, జయలలిత ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. తాను వైద్య విద్యార్థినిగా ఉన్న సమయంలో పలు మార్లు డయాలసిస్ అసిస్టెంట్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా వైద్యులు డయాలసిస్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.