close

తాజా వార్తలు

విజయ డెయిరీ పేరును చెడగొట్టారు:కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపాటు

ఏడు పద్దులకు శాసనసభ ఆమోదం

హైదరాబాద్‌: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలపై విస్తృతంగా అధ్యయనం చేస్తున్నామని, దీనివల్ల రైతులకు లాభాలతోపాటు, ఆహార కల్తీని కూడా నిరోధించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వీటిలో మహిళా సంఘాల వారిని భాగస్వామ్యం చేసేయోచనలో ఉన్నామని అన్నారు. పీడీఎస్‌లో కొన్ని లోపాలు ఉన్నాయన్న సీఎం.. వీటి ద్వారా కల్తీలేని ఆహార పదార్థాలు అందించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. వీటిలో అవినీతిని నిరోధించేందుకు రేషన్‌ డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను కూడా పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘విజయ డెయిరీకి ఉన్న మంచి పేరును కొందరు చెడగొట్టారు. చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేయడం దురదృష్టకరం. మన రాష్ట్రంలో బియ్యం వినియోగం 20-25 లక్షల టన్నుల వరకూ ఉంది. మార్కెట్లలోకి ధాన్యం ఒకేసారి వెళ్లడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. వీటిని పరిష్కరిస్తాం. భవిష్యత్తులో నీటి లభ్యత పెరుగుతుంది కాబట్టి.. పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. అక్టోబరు 15 వరకూ భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది’’ అని కేసీఆర్‌ చెప్పారు.

సమన్వయ సమితులకు త్వరలో పూర్తి అధికారాలు
రైతు సమన్వయ సమితులకు (రైసస) త్వరలోనే పూర్తిస్థాయి అధికారాలు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి త్వరలోనే అధ్యక్షుడ్ని నియమిస్తామని తెలిపారు.

ఏడు పద్దులకు ఆమోదం
శాసనసభలో బుధవారం మొత్తం ఏడు పద్దులకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ, రవాణా, వ్యవసాయం, హోంశాఖ, పశుసంవర్థక, ఎక్సైజ్‌, పౌర సరఫరాలశాఖల పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా శాఖలపై సమగ్ర చర్చలో భాగంగా మంత్రులు వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.