close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. సింగరేణి కార్మికులకు 28 శాతం బోనస్‌:  కేసీఆర్‌

సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతం బోనస్‌ అందజేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌ చెల్లిస్తామన్నారు. దీంతో ప్రతి కార్మికుడు గత ఏడాది కంటే రూ.40,530 అదనంగా పొందనున్నారు. కార్మికుల సమన్వయంతో సింగరేణిలో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించామన్నారు. గత ఐదేళ్లుగా సింగరేణిలో లాభాలు పెరుగుతూనే ఉన్నాయని సభకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. గోదారి ఘటన: మరోరెండు మృతదేహాలు లభ్యం

గోదావరిలో బోటు మునక ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద లభ్యమైన మృతదేహాన్ని హైదరాబాద్‌కు చెందిన పవన్‌కుమార్‌గా భావిస్తున్నారు. మరోవైపు కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద మరో మృతదేహం ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు కచ్చులూరు బోటు మునక ఘటనలో బయల్పడిన మృతదేహాల సంఖ్య 36కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు, డీసీఎం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి కుటుంబం హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా... జనగామ జిల్లా దేవురుప్పల మండలం కామారెడ్డి గూడెం శివారుకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన డీసీఎం వాహనం బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న పెనుగొండ గణేశ్‌(55), సుకన్య(43), డ్రైవర్‌ నజీర్‌(45) అక్కడి కక్కడే మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకటో నెంబర్‌ జనరేటర్‌ బ్రేక్‌ ప్యాడ్స్‌లో మంటలు చెలరేగాయి. దీంతో కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేశారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇకపై ఎన్డీఆర్‌ఎఫ్‌లో మహిళలు కూడా..

ఎన్డీఆర్‌ఎఫ్‌లోకి త్వరలో మహిళలను కూడా తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో మరో నాలుగు కొత్త బెటాలియన్లను తీసుకోనున్నారు. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ బేస్‌గా ఇవి పనిచేయనున్నాయి. అయితే ఈ కొత్త బెటాలియన్లలో మహిళలను కూడా తీసుకోనున్నట్లు ప్రధాన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పాక్‌..అలవాటు మానుకో!

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విమానాన్ని తమ గగనతలం నుంచి అనుమతించబోమని పాక్‌ చెప్పడంపై విదేశాంగ శాఖ స్పందించింది. పాక్‌ నిర్ణయం అంత మంచిది కాదని పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడారు. వీవీఐపీ విమానాలను పాక్‌ ఇలా అడ్డుకోవడం రెండోసారని, ఆ ప్రభుత్వ నిర్ణయం విచారకరమన్నారు. విదేశీ సంబంధాల విషయంలో పాక్‌ ధోరణి సరిగా లేదని, ఈ అలవాటు మానుకోవాలని హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఉత్తమ నటి ఆలియా.. ఉత్తమ నటుడు రణవీర్‌

‘ఐఫా-2019’ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు మెరిసిపోయారు. కత్రినాకైఫ్‌, రణవీర్‌ సింగ్‌ల ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఆలియా భట్‌.. ఉత్తమ నటుడిగా రణవీర్‌ సింగ్‌ ‘ఐఫా-2019’ అవార్డులను అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అధ్యక్షులకు సోషల్‌ మీడియా హానికరం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. మరికొన్ని నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్‌ ప్రచారంలో జోరును పెంచారు. ఈ క్రమంలో అధ్యక్షుడు సోషల్‌ మీడియాకు, టీవీకి దూరంగా ఉండాలంటూ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవాలంటే టీవీలు చూడకూడదు.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 335, నిప్టీ 95 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.16గా ఉంది.

10. తెల్ల కాకిని చూశారా!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.