close

తాజా వార్తలు

సచివాలయ పరీక్ష ఉత్తీర్ణులకు ముఖ్య తేదీలివే!

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి అనుసరించాల్సిన ప్రక్రియలు.. సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్య తేదీలను విడుదల చేసింది. ఉత్తీర్ణత సాధించిన వారు తమ సర్టిఫికేట్‌లను ఈ నెల 21 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 21 నుంచి 22 వరకు అర్హులకు కాల్‌ లెటర్లు పంపిణీ చేస్తారు. ఈ నెల 23న ధ్రువీకరణ పత్రాలు తనిఖీ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తెలిపిన తేదీల్లో నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. 27న ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ అక్టోబర్‌ 1, 2 తేదీల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. అక్టోబర్‌ 2న గ్రామ/ వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.