close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ‘సచివాలయ’ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మాజీ ఎంపీ శివ ప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత

తెదేపా సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం చిత్తూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, మెరుగైన వైద్యం కోసం ఇవాళ ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు

ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. 13 పేజీల నివేదికను గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అందజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దుర్వినియోగంపై నివేదికలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. జేబులు నింపేందుకే ఆ ప్రాజెక్టు:జీవన్‌రెడ్డి

ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసమే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జీవన్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్‌ మీద ఇచ్చిన పనులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. గ్రామపంచాయతీ ట్రైబ్యునల్‌ ఏర్పాటు

గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని 141 సెక్షన్‌ ప్రకారం ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు.  గ్రామ పంచాయతీల వివాదాల అప్పీళ్లను విచారించేందుకు ఏర్పాటు చేసిన ఈ ట్రైబ్యునల్‌కు ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కశ్మీర్‌లో 273 మంది ఉగ్రవాదులు!

రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఒక్క కశ్మీర్‌లోనే 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘావర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భద్రత నడుమ ఉన్న కశ్మీర్‌ లోయలో హింస సృష్టించేందుకు వీరంతా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించారు. వేర్వేరు ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు రానున్న రోజుల్లో పేలుళ్లు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. నాసాకు దొరకని ‘విక్రమ్‌’ ఆచూకీ!

చంద్రుడి ఉపగ్రహంపై నిస్తేజంగా ఉన్న ల్యాండర్‌ విక్రమ్‌ ఫొటోలు తీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల ప్రయత్నించింది. విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌వో) సెప్టెంబరు 17న ఫొటోలు తీసింది. అయితే ఆ ఫొటోల్లో విక్రమ్‌ కన్పించిందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదట. ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తాజాగా నాసా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కోడెలను దారుణంగా హింసించారు: చంద్రబాబు

తెదేపా సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై భయంకరమైన కేసులు పెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆయన్ను మూడు నెలలుగా వేధించారని చెప్పారు. గవర్నర్‌తో భేటీ అనంతరం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని అసెంబ్లీ అధికారులకు కోడెల లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. వైకాపా నేతలు చెప్పినట్లుగానే పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బంగాళాఖాతంలో అల్పపీడనం!

ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీఎస్‌) వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి నదులకు మళ్లీ భారీ వరద ప్రమాద సూచనలు ఉన్నట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. భయాల గుప్పిట మార్కెట్లు గజగజ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌‌ 470.41 పాయింట్లు నష్టపోయి 36,093.47 వద్ద,  నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతో 10704 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికాలోని ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల తగ్గింపు, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీలో మార్పులు చేయకపోవడంతో పాటు ప్రపంచ వృద్ధిరేటుపై ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.