close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. బతుకమ్మ చీరలకు ప్రత్యేక బ్రాండ్‌

బతుకమ్మ పర్వదినం సందర్భంగా నిరుపేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే చీరలకు ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు కల్పించి.. వాటిని రాష్ట్ర మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వీటిని నిరంతరం ఉత్పత్తి చేస్తూ దేశవిదేశాలకు సైతం ఎగుమతి చేస్తామన్నారు. బతుకమ్మ చీరలకు విశేషాదరణ లభించడంతో పాటు, భారీగా డిమాండు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మిగిలిపోనున్న పోస్టులు

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ప్రతిభావంతుల జాబితా (మెరిట్‌ లిస్ట్‌)ను శుక్రవారం ప్రకటించనున్నారు. 14 రకాల పరీక్షలకు సంబంధించి అర్హతను మించి మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి రిజర్వేషన్ల ప్రకారం మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించి గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. దూరం.. కాదిక భారం!

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చే మరో భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌)- బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)కి మధ్య కొత్తగా మధ్యంతర రహదారి (ఇంటర్మీడియట్‌ రింగ్‌రోడ్డు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 103 కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్‌ కష్టాలు చాలావరకు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కోడెల చివరి ఫోన్‌కాల్‌ తొమ్మిది సెకన్లు!

తెదేపా సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో పోలీసులు సాంకేతిక అంశాల ఆధారంగా ముందుకెళ్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్‌ చేశారు. కోడెల సెల్‌ఫోన్‌ కనిపించకపోవడంతో ఆయన కాల్‌డేటాపై దృష్టి సారించారు. కోడెల ఈ నెల 16న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో దాదాపు 10-12 ఫోన్‌కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించినట్లు సమాచారం. అన్నీ దాదాపు రెండు నిమిషాలలోపు.. తెలిసినవారితోనే మాట్లాడినట్లు గుర్తించారు. చివరిగా గన్‌మెన్‌ ఆదాబ్‌కు ఫోన్‌ చేసి దాదాపు 9 సెకన్లపాటు మాట్లాడినట్లు తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వాల్మీకి కాదు.. గద్దలకొండ గణేష్‌

‘వాల్మీకి’ టైటిల్‌ని ‘గద్దలకొండ గణేష్‌’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకుడు. టైటిల్‌ తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పరిణామాలతో చిత్ర బృందం టైటిల్‌ను మార్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఆశలు ఆవిరి

7. యుద్ధం.. ఏదైనా సిద్ధం

భవిష్యత్‌లో జరిగే యుద్ధాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఈదిశగా జాతీయ భద్రతా వ్యూహపత్రం (ఎన్‌ఎస్‌ఎస్‌) తయారవుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ నేతృత్వంలోని రక్షణ ప్రణాళిక కమిటీ (డీపీసీ) రూపొందిస్తున్న పత్రం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 11 సెకన్లకో మరణం

కొన్ని దశాబ్దాలుగా ప్రసవ మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కానీ... ఆ గుండె కోత మాత్రం పూర్తిగా దూరం కాలేదు. నేటికీ ప్రపంచ వ్యాప్తంగా 11 సెకన్లకో గర్భిణి, బాలింత లేదా బిడ్డ తనువు చాలిస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐరాస బాలల నిధి సంస్థ (యునిసెఫ్‌) తదితర సంస్థలు ఈ వివరాలతో కూడిన రెండు తాజా నివేదికలను విడుదల చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఇంటర్నెట్‌ వ్యక్తిగత హక్కే!

ఇంటర్నెట్‌కు సంధానమయ్యే హక్కు కూడా ప్రాథమిక హక్కేనని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఇది రాజ్యాంగంలో పేర్కొన్న వ్యక్తిగత గోప్యత హక్కు, విద్యా హక్కుల్లో భాగంగా ఉంటుందని స్పష్టం చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెల్‌ఫోన్‌ వాడకూడదనే నిబంధనపై కళాశాల విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 400 జిల్లాల్లో బ్యాంకుల రుణమేళాలు

రైతులు, గృహ కొనుగోలుదార్లు, ఇతరత్రా రుణాలు తీసుకునేవారికి రుణ అవకాశాలు కల్పించే నిమిత్తం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), చిన్న రుణ గ్రహీతలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సమావేశాలు నిర్వహించనున్నాయి.   400 జిల్లాల్లో రెండు దశల్లో ఈ రుణ మేళాలు జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తెలిపారు. మొదటి దశలో అక్టోబరు 3 నుంచి 7 వరకు 200 జిల్లాల్లో, రెండో దశలో అక్టోబరు 11 నుంచి 200 జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.