close

తాజా వార్తలు

వేములవాడలో కూలిన వంతెన

వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో కొత్తగా నిర్మిస్తున్న వంతెనలో ఓ భాగం పూర్తిగా ఒరిగిపోయింది. వేములవాడకు చేరుకునేందుకు రూ.28 కోట్లతో నిర్మిస్తున్న హైలెవెల్‌  బ్రిడ్జ్‌ పిల్లర్లు రెండు విరిగిపోయాయి. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెన నిర్మాణంలో ఉపయోగించే ఇనుప చువ్వలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గుత్తేదారు నాణ్యతాలోపంతో చేపట్టిన పనుల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  2016 నుంచి మూలవాగుపై రెండు వంతెనలను నిర్మిస్తున్నారు. మొదటి వంతెన ఇప్పటికే పూర్తి కాగా.. రెండో వంతెన నిర్మాణ దశలో ఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.