close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. దేశ ఖ్యాతి.. విశ్వవ్యాప్తి

పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్‌ సాధించిన విజయాలు, గాంధీ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయలుదేరారు. శనివారం నుంచి వారం రోజుల పాటు (21 నుంచి 27 వరకు) హ్యూస్టన్‌, న్యూయార్క్‌ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తున్నాం

‘తెలంగాణ ఏర్పడక ముందు గొప్పగా ఉందని.. తెరాస హయాంలో ఏం జరగలేదని హేళనగా మాట్లాడటం సరికాదు. 2014కు ముందు కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడి పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. మేం ఆ పరిశ్రమలను తెరిపిస్తున్నాం. మీరు ఇటుకతో కొడితే రాయితో కొట్టే తెలివి మాకుంది’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమలు, పురపాలక, గనుల శాఖల పద్దులపై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల ఆరోపణలు, విమర్శలకు దీటుగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏపీలో 3 భారీ నౌకాశ్రయాలు

రాష్ట్రంలో మూడు భారీ నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మచిలీపట్నాన్ని మేజర్‌ పోర్టుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌పై ఒత్తిడి తగ్గించాలని, ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. విచారణకు ఏపీ సీఎం జగన్‌ పిటిషన్‌

తనకు బదులుగా కోర్టు విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సీఎంగా పలు విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున న్యాయవాది హాజరుకు అనుమతించాలని సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ల్యాండర్‌ చరిత్ర సమాప్తం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ల కథ సమాప్తమైనట్లే. ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ గల్లంతైన ల్యాండర్‌తో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. మరోవైపు ఆ ప్రదేశంపై 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయం ముగిసిపోనుంది. రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఏటా సర్దార్‌ పటేల్‌ జాతీయ ఐక్యతా అవార్డు

పద్మ అవార్డుల మాదిరిగా ఇకపై దేశ ఐక్యత, సమగ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు, సంస్థలకు సర్దార్‌ పటేల్‌ జాతీయ ఐక్యతా అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈమేరకు విధి విధానాలను కేంద్ర హోంశాఖ తెలిపింది. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం చేసే ఈ అవార్డు రూపురేఖలను వెల్లడించింది. శుద్ధమైన బంగారం, వెండి మిశ్రమంతో దీన్ని రూపొందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. డిజిటల్‌ లావాదేవీలకు భరోసా

డిజిటల్‌ నగదు బదిలీ సందర్భాల్లో.. ఖాతాలో నగదు డెబిట్‌ అయినా ఏటీఎం నుంచి రాకపోవడం, ఆన్‌లైలో బదిలీ చేసినప్పుడు మన ఖాతాలో డబ్బు కట్‌ అయి అవతలి వ్యక్తికి జమకాకపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటి పరిష్కారానికి ఆర్‌బీఐ కచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసింది. నగదు 1-5 రోజుల్లోగా తిరిగి ఖాతాలో చేరాలని, గడువు దాటితే, వినియోగదారునికి రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ట్రాఫిక్‌ జరిమానాల పెంపు వెనుక ఉద్దేశమిదే!

దేశంలో కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించడం వెనుక అసలు కారణం వాహనదారుల ప్రాణాలను కాపాడటమేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టానికి  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా మద్దతు ప్రకటించారని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఇండియా టుడే’ కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

9. వివో వీ17 ప్రో ధర రూ.29,990

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో, కొత్తగా వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 6.44 అంగుళాల తెర, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌తో పాటు ప్రపంచంలోనే తొలిసారిగా 32+8 మెగాపిక్సెల్‌ పాప్‌-అప్‌ కెమేరాలు ముందువైపు అమర్చినట్లు సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. పసిడికి పంచ్‌ దూరంలో పంగాల్‌

భారత బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ (52 కిలోలు) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. సెమీస్‌లో అతడు కజక్‌స్థాన్‌కు చెందిన సాకెన్‌ బిబోసినోవ్‌ను 3-2తో ఓడించి అబ్బురపరిచాడు. శనివారం జరిగే ఫైనల్లో పంగాల్‌ ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ షాఖోబిదిన్‌ జొయిరోవ్‌తో స్వర్ణం కోసం తలపడనున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.