close

తాజా వార్తలు

జగన్‌ను కలిసిన తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ కలిశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ముందు రోజు అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.