close

తాజా వార్తలు

ఆ వ్యక్తిపై 189 చలానాలు పెండింగ్‌లో..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోటారు వాహనాల చట్టంలో కొత్త నిబంధనలు వచ్చాక అందరికీ చలానాల భయం పట్టుకుంది. ఒక్క చలానా పడినా జేబుకు చిల్లు పడుతుందేమోనని ప్రజా రవాణానే నమ్ముకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే, చండీగఢ్‌కి చెందిన ఓ వ్యక్తి మీద మాత్రం ఏకంగా 189  చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి.  2017 నుంచి ఇప్పటి వరకు వివిధ సమయాల్లో ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించినందుకు గానూ ఇన్ని చలానాలు విధించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంజీవ్‌ అనే వ్యక్తి చండీగఢ్‌లో ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది  జులై 26న తప్పుడు దారిలో యూటర్న్‌ తీసుకున్నందుకు గానూ ఈయనకు రూ.300 జరిమానా వేశారు. తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు ఈ ఒక్క చలానాతో అతడిపై ఉన్న పెండింగ్‌ చలానాలన్నీ బయటకు వచ్చాయి. అతడి పేరు మీద 189 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే, ఈ విషయం తెలుసుకున్న సంజీవ్ అవాక్కయ్యాడు. తాను ఏడాదిన్నర క్రితమే సెకండ్‌హ్యాండ్‌  ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశానని, రెండేళ్ల నుంచి తానెలా నిబంధనలు ఉల్లంఘిస్తానని వాపోతున్నారు. ఒక్క చలానా గురించి కూడా తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని చెప్పాడు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.