close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. అక్టోబరు 21న మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబరు 21న రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికలసంఘం శనివారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 27న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అక్టోబరు 4న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబరు 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 7వరకు గడువు ఉంటుంది. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి అక్టోబరు 24న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్‌ అరోరా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. తెలంగాణ పురపాలక సవరణ బిల్లుకు ఆమోదం

ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతో తెలంగాణలో తీసుకొచ్చిన పురపాలక చట్టసవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు కావాలని అన్నారు. జవాబుదారీ తనంలో  తక్కువ కాలవ్యవధిలో మెరుగైన సేవలు పొందేలా సవరణలు చేసినట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అసత్య ప్రచారాలు మానుకోవాలి: మంత్రి అనిల్‌

పోలవరం ప్రాజెక్టు విషయంలో పారదర్శక విధానంతోనే ముందుకెళ్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పునరుద్ఘాటించారు. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను పారదర్శకతతో నిర్వహించామన్నారు. తాడేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.58 కోట్లు మిగిల్చామని చెప్పారు. కేవలం రూ.274 కోట్ల పనికి రూ.58 కోట్లు మిగల్చగలిగామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఇందిరాపార్కు వద్ద రైతుల ఆందోళన

నగరంలోని ఇందిరా పార్కు వద్ద భాజపా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు సుగుణాకర్‌ రావు, ప్రమేందర్‌రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు. 

5. ప్రేమజంట ఆత్మహత్య

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అన్నారపాడుకు చెందిన గుగులోత్‌ గోపి(22), లావుడ్యా సింధు(21) సమీప బంధువులు. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు తెలిపి తాము వివాహం చేసుకోబోతున్నామని చెప్పడంతో అందుకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. భాజపా మళ్లీ రావాలంటే మరో పుల్వామా జరగాలి: పవార్‌

భాజపా ప్రభుత్వంపై మహారాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఒకవేళ ప్రజలకు సర్కార్‌పై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలంటే పుల్వామా లాంటి ఘటనలు జరగాలని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ సర్కారుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండేవారని.. కానీ, పుల్వామా ఘటన తదనంతర పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని సమూలంగా మార్చివేశాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. తదుపరి లక్ష్యం గగన్‌యాన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం 98శాతం విజయవంతమైందని ఇస్రో అధినేత కె.శివన్‌ తెలిపారు. భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌ చాలా బాగా పనిచేస్తోందని తెలిపారు. స్రో తదుపరి లక్ష్యం ‘గగన్‌యాన్‌ మిషన్‌’ అని శివన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇస్రో చరిత్రలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’. దీని ద్వారా 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. భారత్‌లో పెట్టుబడులకు ఇదిగొప్ప అవకాశం!

కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా వాణిజ్య వర్గాలు స్వాగతించాయి. భారత్‌ కేంద్రంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది ఒక మంచి అవకాశం అని వారు అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని గాడిలో పెడుతున్నట్లు భావిస్తున్నామని భారత్‌-అమెరికా వ్యూహత్మక భాగస్వామ్య వేదిక(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) అధ్యక్షుడు ముఖేశ్‌ ఆఘి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సౌదీకి అమెరికా బలగాలు!

సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో చమురు క్షేత్రాలపై దాడికి ఇరాన్‌ కారణమని భావిస్తున్న అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీతో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కి సహకారంగా పరిమిత స్థాయిలో బలగాలను పంపాలని నిర్ణయించింది. అయితే ఈ బలగాలు దాడి చేయడానికి మాత్రం కాదని కేవలం రక్షణ కోసమేనని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కార్తికేయ ‘90ఎంఎల్‌’ టీజర్‌ విడుదల


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.