close

తాజా వార్తలు

5 గంటలకు శివప్రసాద్‌ అంత్యక్రియలు

తిరుపతి: చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు, దర్శకుడు, తెదేపా సీనియర్‌ నాయకుడు ఎన్‌.శివప్రసాద్‌(68) అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లా ఐతేపల్లి వద్ద అరగాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని తిరుపతిలోని ఆయన నివాసంలో ఉంచారు. సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. శివప్రసాద్‌ అంతిమయాత్రలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొననున్నారు. మూత్ర పిండ సంబంధిత వ్యాధిలో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం శివప్రసాద్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.