close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @1 PM

1. మేం ప్రజలనే నమ్ముకున్నాం: కేసీఆర్‌

తెరాస ప్రభుత్వం ప్రజలనే నమ్ముకుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. గత కాంగ్రెస్‌ పాలన కంటే తెరాస ప్రభుత్వం ఎంతో మేలని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు తెరాస వైపే వచ్చిందన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై భట్టి విక్రమార్క చెప్పిన మాటలు అందరూ విన్నారనీ, ఫలితమేంటో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. సాహసం, త్యాగాలమీదే తెరాస పుట్టిందని, రాజీనామాలు, సవాళ్లు ఎదుర్కోవడం ఇది కొత్తేం కాదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆర్థిక ప్రగతిని శాసించేది అదే..: వెంకయ్య

గత 18 ఏళ్లుగా స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో 200 పైగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేని వారి వద్దకే వైద్యాన్ని తీసుకురావడం ఆనందించాల్సిన విషయమన్నారు. స్వర్ణ భారతి ట్రస్టులో కిమ్స్‌ ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. వారంలో ఒక రోజు వైద్యులు గ్రామాలు, బస్తీలకు వెళ్లాలని సూచించారు. అక్కడి ప్రజలకు ముందస్తు చర్యలపై అవగాహన కల్పించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యమే దేశ ఆర్థిక ప్రగతిని శాసిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇంటర్‌ అవకతవకలపై చర్యలు చేపట్టాలి

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. దీనికి కారణమైన ప్రైవేటు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్‌ప్లాన్ నిధులపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పడుతున్నాయని కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో చెబుతోందని చెప్పారు. అంతేకాకుండా కూకట్‌పల్లిలో పట్టాభూములు కలిగిన వారిని బెదిరిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శివప్రసాద్‌ లేని లోటు తీర్చలేనిది: పెద్దిరెడ్డి

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ పార్టీలకు అతీతంగా అందరితోనూ సన్నిహితంగా ఉండేవారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి పెద్దిరెడ్డి, తెరాస ఎంపీ నామానాగేశ్వరరావు నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివప్రసాద్‌లేని లోటు తీర్చలేనిదని చెప్పారు. అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విద్యారంగంలో తెలంగాణ వెనుకబాటు: కాగ్‌

యురేనియం తవ్వకాలపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనమండలి ఆమోదించింది. అంతేకాకుండా 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదికను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. అందులోని విషయాలను మంత్రి కేటీఆర్‌ సభకు వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి వ్యయం, క్యాపిటల్‌ వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ.. విద్యా రంగంలో మాత్రం వెనకబడి ఉందని తేల్చిచెప్పిందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హ్యూస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌ లో మోదీ ఏంచేశారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రం హ్యూస్టన్‌కు చేరుకున్న ఆయనకు అక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన విమానం దిగి నడిచి వస్తుండగా అక్కడున్న అధికారులు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సమయంలో ఆయనకు పుష్పగుచ్ఛంను ఇచ్చారు. దీనిని ఆయన అందుకుంటున్న సమయంలో అందులోనుంచి ఒక పువ్వు రెడ్‌ కార్పెట్‌పై పడిపోయింది. వెంటనే దీన్ని గమనించిన ప్రధాని మోదీ కిందకు వంగి దాన్ని తీసుకుని పక్కనే ఉన్న సహాయకులకు అందజేశారు. ప్రధాని నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చమురు కంపెనీల సీఈవోలతో మోదీ భేటీ

వారం రోజుల పర్యటనలో భాగంగా మోదీ అమెరికాలో ఉన్నారు. ఈరోజు ఆయన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఇందుకుగానూ ఆయన శనివారమే హ్యూస్టన్‌ చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆదివారం ఉదయం 16 చమురు కంపెనీల సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. టెల్లూరియన్‌(అమెరికా)-పెట్రోనెట్‌(భారత్‌) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆహారం లేదన్నాడని కాల్పులు

దాబా మూసివేసే సమయంలో ఆహారం లేదని చెప్పిన యజమానిపై కాల్పులు జరిపాడో కానిస్టేబుల్‌... ఘజియాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం... యూపీలోని ముజఫర్‌నగర్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్‌ బాలియన్‌ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భోజనం కోసం దగ్గరలోని ధాబాకు వెళ్లాడు. అయితే ధాబా సమయం ముగియడంతో ఆహారం లేదని నిర్వహకుడు ఆజాద్‌ కుమార్‌  తెలిపాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌ తన దగ్గర ఉన్న పిస్తోల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహేశ్‌, నమత్ర..ఓ ఎమోషనల్‌ మెసేజ్‌

‘డాటర్స్‌ డే’ సందర్భంగా టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు తన గారాలపట్టి సితారకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె సితారను ఉద్దేశిస్తూ.. ఓ స్పెషల్‌ వీడియోను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. అనేక సందర్భాల్లో సితారతో కలిసి దిగిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. ‘నా బుజ్జి సితా పాపా నీకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు. నువ్వు చాలా అద్భుతమైన, ప్రియమైన, అల్లరి కుమార్తెవు. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను.’ అని మహేశ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రామోజీఫిల్మ్‌ సిటీలో ‘దసరా కార్నివాల్‌’ 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.