close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM

1. అద్భుతమైన రెవెన్యూ చట్టం తెస్తాం: కేసీఆర్‌

రాష్ట్రంలో అద్భుతమైన రెవెన్యూ చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో వెల్లడించారు. వాస్తవ రైతులకు నష్టం జరగనియ్యమన్నారు. కౌలుదారులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించదని చెప్పారు. భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వెనుకబడిన జిల్లాలను ఆదుకోవాలని విన్నవించినా.. భాజపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఒక్క భాజపా పాలిత రాష్ట్రంలోనైనా ఆసరా పింఛన్‌ ఉందా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కశ్మీర్‌ అంశాన్ని రాజకీయంగా చూడొద్దు: షా

జమ్మూకశ్మీర్‌ అంశంలో కాంగ్రెస్‌ వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు చేశారు. మహారాష్ట్ర శాసనసభా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ముంబయిలో ఓ ప్రచార సభలో ప్రసంగించారు. ‘‘ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం’ అని భాజపా దేశం కోసం నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే జమ్మూకశ్మీర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ రాజకీయంగా చూస్తుంటే.. మేము దీన్ని దేశభక్తిగా చూస్తున్నాం’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అడగ్గానే రాజకీయాల్లోకి వచ్చారు:చంద్రబాబు

మాజీ ఎంపీ శివప్రసాద్ వైద్యుడిగా ఉంటూనే సినిమారంగంపై ఎనలేని ఇష్టాన్ని పెంచుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శివప్రసాద్‌ పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని కోరిన వెంటనే తన మీద ఉన్న నమ్మకంతో వచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

పాకిస్థాన్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌ ప్రభుత్వ ప్రతినిధి ఫయాజుల్లా ఫరక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం స్కర్దు పట్టణం నుంచి రావల్పిండి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు గెట్టిదాస్‌ ప్రాంతానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ నుంచి పునియా ఔట్‌

భారత రెజ్లర్‌ దీపక్‌పునియా ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి నిష్క్రమించాడు. 86 కేజీల విభాగంలో స్విట్జర్‌లాండ్‌ రెజ్లర్‌ రీచ్‌ముత్‌పై 8-2 తేడాతో శనివారం సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన పునియా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు తప్పుకున్నాడు. ఆదివారం ఇరాన్‌కు చెందిన రియో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ హసన్‌ యజ్దానీతో తలపడాల్సి ఉండగా ఎడమకాలి గాయం కారణంగా తాను ఆడట్లేదని పునియా పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తెజస మద్దతు కోరిన ఉత్తమ్‌

తెలంగాణ జన సమితి (తెజస) పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఉత్తమ్‌ ఒక్కరే తార్నాకలోని కోదండరాం నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గంటసేపు వీరిద్దరు చర్చించారు. భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో మద్దతు కోరడానికి కోదండరాం ఇంటికి వచ్చానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. విశాఖ జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. 75గజాల్లోపు ఇళ్లకు అనుమతులక్కర్లేదు: కేటీఆర్‌

మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. తప్పు ఎవరు చేసినా కఠినంగా శిక్షిస్తామన్నారు. జనంలో భయం, అవగాహన కల్పించేందుకే చట్టాన్ని కఠినంగా రూపొందించినట్లు చెప్పారు. శాసన మండలిలో మున్సిపల్ కొత్త చట్టంపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బెంగళూరు మ్యాచ్‌కు వర్షం ముప్పు?

భారత్‌ X దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొన్ని గంటల్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చివరి టీ20 జరగనుంది. అయితే ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితులు చూస్తుంటే 40 శాతం వర్షం పడే అవకాశముందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వీడియో సరదా.. ప్రాణం తీసింది 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.