close

తాజా వార్తలు

హెల్మెట్‌ లేకపోతే.. పెట్రోల్ పోసేది లేదు..!

బెంగళూరు: ప్రజలు హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపే విధంగా కర్ణాటకలోని కలబురగి కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘నో హెల్మెట్‌-నో పెట్రోల్‌’ అనే కొత్త నిబంధన అమల్లోకి తేనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక నుంచి హెల్మెట్‌ లేకుండా నడిపితే వాహనదారులకు పెట్రోల్‌ లభించదంటూ హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పెట్రోల్‌ బంక్‌లకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పోలీస్‌ కమిషనర్‌ ఎంఎన్‌ నాగరాజ్‌ మాట్లాడుతూ.. కలబురగి కమిషనరేట్‌ పరిధిలోని ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించకపోతే వారికి పెట్రోల్‌ బంక్‌ల్లో పెట్రోల్‌ లభించదన్నారు. ఈ నిబంధన సెప్టెంబర్‌ 29 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వాహనదారులను ప్రమాదాల నుంచి తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాహనదారులకు ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్‌ 1 నుంచి నూతన వాహన చట్టం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు పడుతున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.