
తాజా వార్తలు
ఇంటి వైద్యం
ఏది తీసుకున్నా తేన్పులు వస్తుంటాయి కొందరికి. దీంతో పాటు మరిన్ని సమస్యలూ ఇబ్బంది పెడతాయి. ఆహారపుటలవాట్లు మార్చుకుని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.
కడుపులో అతిగా పేరుకుపోయిన వాయువులు బయటికి తేన్పుల రూపంలో వస్తాయి. ఈ వాయువులు జీర్ణాశయంలో చేరడానికి కారణాలున్నాయి. మాట్లాడుతున్నప్పుడు లేదా ఆహారం తీసుకుంటున్నప్పుడు అధికంగా గాలిని మింగడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఎసిడిటీ, హియాటస్ హెర్మా వంటివాటితో కడుపులో వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఈ సమస్య ఎక్కువైతే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏం చేయాలి ఆహారం తీసుకునేటప్పుడు నోరు మూసుకుని నమిలితే గాలి లోపలకి వెళ్లదు. మాట్లాడుతూ తినడం, నోరు తెరుచుకుని నమలడం వంటి అలవాట్ల కారణంగా కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్తుంది. నిదానంగా నమిలి తింటే పొట్టలో గాలి చేరకుండా చూసుకోవచ్చు. పాలు, చిక్కుడు జాతి కూరలు, క్యాబేజీ, ఉల్లిపాయతోపాటు వేపుళ్లను తగ్గించు కోవాలి. అప్పుడే వాయువులు తగ్గుతాయి. అల్లం, శొంఠి, ఇంగువ, వాము, పుదీనా, సోంపు, జీలకర్రను ఎక్కువగా వాడుతుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. దీనివల్ల తేన్పులను నిరోధించవచ్చు. ముఖ్యంగా ఒకసారి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేవరకు మళ్లీ తినకూడదు. |
చిట్కాలు * వాము వేయించి పొడి చేసుకోవాలి. కొద్దిగా వేడి అన్నంలో చెంచా వాముపొడి, అరచెంచా కరిగించిన నెయ్యి వేసుకుని తినాలి. మీ ప్రశ్నలు vasuayur@eenadu.net కు పంపించగలరు. |
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
