close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం 

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పూలపండుగ పాటలు ఊరూవాడా మార్మోగనున్నాయి. ఆడపడుచులు ఆడిపాడి ఘనంగా చేసుకునే బతుకమ్మ సంబురాలు శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ వరకూ ఇంటింటా సంబురాలు సాగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఈఎస్‌ఐ కుంభకోణంలో కీలక మలుపు

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అక్రమాల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తాజాగా బయటకొచ్చాయి. అందులోని వివరాల ప్రకారం తప్పుడు బిల్లులు పెట్టాలని ఈఎస్‌ఐ డాక్టర్‌ను సెక్షన్‌ ఆఫీసర్‌ సురేంద్రనాథ్‌ ఆదేశించాడు. రూ.50 లక్షలకు తప్పుడు బిల్లులు తయారు చేసి పంపాలంటూ సదరు డాక్టర్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఏడాది తర్వాత క్యాంపు నిర్వహించినట్లు బిల్లులు తయారుచేయాలని ఆమెకు సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కోరుకున్న చోటే ఇళ్లు

కృష్ణా నది కట్టపైన, కరకట్ట లోపల, కాల్వ గట్లపై నివసిస్తున్నవారికి వారు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం రెండు సెంట్ల విస్తీర్ణంలో వీరందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పీపీఏలపై అవాస్తవాలు చెబుతారా?

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) తప్పుడు సమాచారం చెప్పి, నిరాధారమైన ఆరోపణలు చేసిన అధికారులు అజేయకల్లం, పీవీ రమేష్‌, నాగులాపల్లి శ్రీకాంత్‌లపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్‌చేశారు. అఖిల భారత సర్వీసు నిబంధనల్ని, క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆ అధికారులకు సర్వీసులో కొనసాగే అర్హత లేదన్నారు. రూ.43 వేల కోట్లు దోచుకుని, 12 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న సీఎం జగన్‌కు వారు అత్యంత నీతిమంతుడంటూ కితాబిచ్చారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఒకే తరహాలో ఎంటెక్‌ రుసుములు

ఎంటెక్‌ కోర్సులో సంస్కరణలు తీసుకురావాలన్న త్రిసభ్య కమిటీ సిఫార్సులను ఐఐటీ కౌన్సిల్‌ ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐటీల్లోనూ ఒకేతరహా ఎంటెక్‌ రుసుములు ఉండాలని, బీటెక్‌ కోర్సులకు మాదిరిగానే ఎంటెక్‌ కోర్సుల రుసుములను వసూలు చేయాలని ఆ కమిటీ సిపార్సు చేసింది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లు ఐఐటీలు స్పాన్సర్డ్‌ స్టూడెంట్స్‌, స్పాన్సర్డ్‌ కోర్సులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భారత్‌ శాంతి మంత్రం..  పాక్‌ ద్వేష తంత్రం

ఐరాస సర్వప్రతినిధి సభ వేదికగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌లు సాగించిన ప్రసంగాల్లో తొంగిచూసిన వైరుధ్యాలివి. అనాదిగా భారత్‌కు మూలమంత్రాలైన శాంతి, సామరస్యం గురించి మోదీ మాట్లాడితే.. ఉగ్రవాదం, రక్తపాతం గురించి ఇమ్రాన్‌ ప్రస్తావించారు. మహనీయుల శాంతి బాటలో నడుస్తూ అభివృద్ధి ఫలాలు అందుకుందామని మోదీ సందేశమివ్వగా కశ్మీర్‌ అంశంపై నిందలు వేస్తూ అక్కడ హింస తప్పదంటూ రెచ్చగొట్టేలా ఇమ్రాన్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఏకరీతిలో ప్రభుత్వరంగ  బ్యాంకుల పనివేళలు

రాష్ట్రంలో ఇక నుంచి ఖాతాదారులకు మెరుగైన, సత్వర సేవలు అందించడానికి వీలుగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకరీతి సమయపాలన పాటించనున్నాయి. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ, జిల్లా కమిటీలు ఆమోదం తెలిపాయి. అక్టోబరు 1 నుంచి ఉదయం 10 - సాయంత్రం 4 గంటల మధ్య బ్యాంకులు పనిచేస్తాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా ఏకరీతి సమయపాలన అవసరమని కేంద్ర ఆర్థిక సేవల విభాగం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సీమలో హైకోర్టు!

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని, అది 13 జిల్లాలకు విస్తరించాలని పేర్కొన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం కారణంగా బాధిత గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం కనుగొంటుందని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బోయింగ్‌ 737 మ్యాక్స్‌లు మళ్లీ రంగంలోకి

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు మరో 3-4 నెలల్లో భారత గగనతలంలో మళ్లీ విహరించనున్నాయి. బోయింగ్‌ ఇండియా అధికారి ఒకరు ఈ విషయాన్ని   వెల్లడించినట్లు  తెలుస్తోంది.  ఈ విమానాల భద్రతా   ప్రమాణాలకు  సంబంధించి డైరెక్టరేట్‌  జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) లేవెనెత్తిన అంశాలను  పరిష్కరించడంలో బోయింగ్‌ ఇండియా ప్రతినిధులు నిమగ్నమయ్యారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. శంకర్‌కు నిరాశ

ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావించిన భారత బృందానికి శుక్రవారం పోటీల తొలిరోజే చేదు ఫలితం.. కచ్చితంగా ఫైనల్‌ చేరే అవకాశం ఉందని భావించిన లాంగ్‌జంప్‌ కెరటం శ్రీశంకర్‌ క్వాలిఫికేషన్లోనే ఇంటిముఖం పట్టాడు. తొలి ప్రయత్నంలో 7.52 మీటర్లు మాత్రమే దూకిన శంకర్‌.. రెండో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా 7.62 మీటర్లు లంఘించాడు. కానీ మూడో ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన శంకర్‌.. గ్రూప్‌-బిలో 12వ స్థానం.. మొత్తం మీద 17వ స్థానంతో ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.