close

తాజా వార్తలు

అక్క ప్రేమే రక్షించుకుంది!

చిట్టి తమ్ముడిని చిరుత నుంచి కాపాడుకున్న 11 ఏళ్ల బాలిక

పౌడీ(ఉత్తరాఖండ్‌): నాలుగేళ్ల తమ్ముడిని అంతులేని ప్రేమతో, అంతేగొప్ప సాహసంతో ఓ చిరుత నుంచి  కాపాడుకున్న పదకొండేళ్ల అక్కయ్య కథ ఇది. చిట్టితమ్ముడిని కాపాడుకునే క్రమంలో రాఖీ(11) అనే ఆ బాలికకు మెడమీద తండ్రి గాయాలయ్యాయి. పౌడీ జిల్లాలోని దేవ్‌కుండయ్‌ తాల్లీ గ్రామంలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి బయట నాలుగేళ్ల తమ్ముడితో రాఖీ ఆడుకుంటుండగా ఓ చిరుత హఠాత్తుగా వారి మీదికి దూకింది. రాఖీ వెంటనే తన తమ్ముడి మీదకు ఒరిగిపోయి, చిరుత చేతికి చిక్కకుండా చూసింది. చిరుత దాడిచేస్తున్నా సరే చలించలేదు. స్థానికులు గుమిగూడి గట్టిగా అరవడంతో చిరుత పారిపోయింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.