close

తాజా వార్తలు

ఒక్క ప్రశ్నకు 360 జవాబులు

మధ్య ప్రదేశ్‌లో ఆర్టీఐ అధికారుల నిర్వాకం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో సమాచార హక్కు చట్టం అధికారులు ఓ పాత్రికేయుడికి చుక్కలు చూపిస్తున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త అయిన జితేంద్ర సూరానా పోస్టాఫీసు స్థిర ఆస్తుల వివరాల కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 360 సమాధానాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. భోపాల్‌లోని ఓ పోస్టాఫీసు పరిసరాల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ విలువ తెలపాల్సిందిగా సూరానా ఆగస్టు 7న ఆర్టీఐకి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 13 నుంచి అతడికి వందల సంఖ్యలో పోస్టులు వచ్చి పడుతున్నాయి. అలా అప్పటి నుంచి ఇప్పటివరకు 360 సమాధానాలు వచ్చాయి.

ఆర్టీఐ అధికారుల తీరు సూరానాను విసుగుపుట్టిస్తోంది. వచ్చిన సమాధానాల్లో చాలా మటుకు ఆయన అడిగిన ప్రశ్నకు పొంతన లేనివే. అంతేకాకుండా పోస్టాఫీసు ఉన్న ప్రాంత రిజిస్టర్‌ వాల్యూ చెప్పమంటే 1870 నాటిది చెప్పడం గమనార్హం. ఆర్టీఐలో ఉన్న కొందరు అధికారులకు ఆ చట్టం ప్రాముఖ్యం కూడా తెలియడం లేదంటూ సూరానా వాపోతున్నారు. ఆన్‌లైన్లో దరఖాస్తుకు అందులోనే సమాధానమివ్వాలి గానీ పోస్టుల ద్వారా సమాధానం పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీఐ అధికారుల నిర్లక్ష్యం పట్ల వారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని సూరానా నిట్టూర్చుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.