close

తాజా వార్తలు

సమ్మె అణచేందుకు కేసీఆర్‌ యత్నం:రేవంత్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ సమస్య ఎర్ర బస్సుది కాదని... పేద ప్రజల సమస్య అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పీఆర్‌టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇస్తామన్న విషయాన్ని ముఖ్యమంత్రి మరిచారా అని ప్రశ్నించారు. సమ్మెకు దారితీసిన కారణాలు ఏంటనేదానిపై  సీఎం ఆలోచనలు చేయడంలేదని, సమస్య పరిష్కారం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదని విమర్శించారు.

రెండు రోజులు డ్యూటీకి రానివారు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయితే... ఆరేళ్లు సచివాలయానికి రాని కేసీఆర్‌పై పీడీ యాక్ట్‌ పెట్టి అండమాన్‌ జైల్లో పెట్టాలన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లల చావులకు.. ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి  చావుకు కారణమయ్యారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు అధికారికంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు సమాజానికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవాలని కోరారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు సీఎం రంగం సిద్ధం చేశారని, ఆర్టీసీ కార్మికుల సమ్మె విఫలమైతే తెలంగాణలో ప్రశ్నించే గొంతులు ఉండవన్నారు. ఈనెల 19న తలపెట్టిన బంద్‌కు అందరూ సహకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సకల జనులుగా ఏర్పడి...సకలజనుల సమ్మె చేసి సీఎం కేసీఆర్‌ మెడలు వంచాలని ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.