close

తాజా వార్తలు

చిత్రవార్తలు

‘చిన్నతాచు.. చిక్కిందిలా’ 

రాజమహేంద్రవరం లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో తాచుపాము పిల్ల చొరబడింది. ఈ విషయం తెలిసిన లలితానగర్‌కు చెందిన ఈశ్వర్‌ పిల్లపామును చాకచక్యంగా పట్టుకున్నారు. పామును అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు నగరవనానికి వెళ్లగా అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమీపంలో పొదల్లో విడిచిపెట్టారు.


తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే.. రావే.. నోట్లోకి

రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరు రోడ్డులోని ఓ ఇంట్లో గోడపై వాలిన తూనీగను బల్లి గుటుక్కుమనిపించింది. దూరంగా మాటువేసిన బల్లి తూనీగను అమాంతం నోటకరచుకొని మింగుతున్న చిత్రమిది.


సోనియా రథయాత్ర

వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఆదివారం న్యూదిల్లీలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రథయాత్రను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రారంభించారు.


నమో మాతృమూర్తికి ప్రథమ పౌరుడి వందనం 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గాంధీనగర్‌లో నివాసముంటున్న ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముకుళిత హస్తాలతో రాష్ట్రపతి నమస్కరించగా.. ప్రతిగా హీరాబెన్‌ ఆయనను దీవించారు.


కరి మబ్బులు కమ్మేసి వెళ్లాయి

తిరుపతి నగరంలో వేసవిని తలపిస్తూ ఉదయం 9గంటలకే ఎండ కాస్తోంది. మధ్యాహ్నం వేళ కారుమబ్బులు కమ్ముకోవడంతో వర్షంపడుతుందేమోనని ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు ఎదురు చూశారు. కానీ ఎవరో పిలిచినట్లు మేఘాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. 


ముక్క ఎప్పుడు ఊడుతుందో.. జర పైలం

ఇటీవలే అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ పెచ్చులు ఊడి పడటంతో కిందనే నిల్చున్న ఓ మహిళ మృతిచెందింది. తాజాగా నాగోల్‌ స్టేషన్‌ మెట్రోస్టేషన్‌ను నిశితంగా పరిశీలిస్తే అలాంటి ప్రమాదమే జరిగే ఛాయలు కన్పిస్తున్నాయి. ప్రమాదం జరగక ముందే అధికారులు మేల్కొంటే బాగుంటుందని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.