close

తాజా వార్తలు

ఈ మేక.. చేతిపంపు నీరే తాగుతుందట.!

సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఓ మేక పుట్టినప్పటి నుంచి గత అయిదేళ్లుగా కేవలం చేతిపంపు నీరు మాత్రమే తాగుతూ దాహం తీర్చుకుంటోంది. ఆ గ్రామానికి చెందిన మూరబోయిన లవయ్య, రాజమ్మ దంపతులు జీవాల పోషకులు. అయిదేళ్ల క్రితం ఓ మేకను కొనుగోలు చేసి తెచ్చారు. ఆ మేకకు పుట్టిన ఓ పిల్ల మందతో పాటు ఓసారి మేతకు వెళ్లింది. జీవాలకు నీరు తాపించేందుకు కాపరి వాటిని సమీపంలోని చేతిపంపు వద్దకు తోలుకెళ్లారు. ఆయన చేతిపంపు కొడుతుండగా తొట్టెలో పడిన నీటిని తాగి దాహార్తి తీర్చుకున్నాయి. మందలోని ఈ మేక పిల్ల మాత్రం కాపరి కొడుతుండగా గొట్టం నుంచి బయటికి వచ్చిన నీటినే తాగింది. అప్పటి నుంచి అదే అలవాటుగా మార్చుకుంది. మేత కోసం పొలం వెళ్లినప్పుడు వాగులు, చెరువులు, కాలువల్లోని నీటిని మిగిలినవి తాగుతుంటాయి. ఈ మేక మాత్రం చేతిపంపు కనిపించగానే దాహార్తి తీర్చుకునేందుకు అక్కడికి పరుగులు తీస్తుంది. చెరువులు, కాలువలు, కుంటలు, ప్రవాహం కనిపించినప్పటికీ ఆ నీటిని తాగక పోవడం విశేషం. - న్యూస్‌టుడే, సంతమాగులూరు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.