close

తాజా వార్తలు

చనిపోయిన బిడ్డను పూడ్చడానికెళితే..

లఖ్‌నవూ: పురిట్లోనే మరణించిన బిడ్డను పూడ్చిపెట్టేందుకు శ్మశానానికి వెళ్లిన ఓ తండ్రికి అనుకోని సంఘటన ఎదురైంది. తన బిడ్డను పూడ్చడానికి గుంత తవ్వుతుండగా.. మూడు అడుగుల లోతులో ఓ కుండ కనిపించింది. ఏంటా అని తీసి చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రాణంతో ఉన్న ఓ నెలల పసికందు అందులో ఉండడం చూసిన ఆయనకి మాటలు రాలేదు. ఆదివారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హితేశ్‌ కుమార్‌ శిరోహి భార్య వైశాలి ఎస్‌ఐగా పనిచేస్తోంది. ఆమెకు గురువారం పురిటి నొప్పులు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ బిడ్డ క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి హితేశ్‌ శ్మశానానికి వెళ్లాడు. గుంత తవ్వుతుండగా.. మూడు అడుగుల లోతులో ఓ కుండ కనిపించింది. దానిని తీసి చూడగా.. అందులో ప్రాణంతో ఉన్న నెలల పసిపాప  ఉంది. దీంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆ పాపకు పాలు పట్టి పోలీసులకు అప్పగించాడు.

అప్పటికే కష్టంగా ఊపిరిపీల్చుకుంటున్న ఆ పాపను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించడానికి స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా ముందుకు రావడం విశేషం. బతికున్న బిడ్డను పూడ్చి పేగుబంధాన్ని తెంచుకోవాలనుకున్న ఆ కర్కశ తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.