close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 1 PM

1. ఉద్ధృత రూపం దాల్చుతున్న ఆర్టీసీ సమ్మె

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్ధృత రూపం దాల్చుతోంది. వరుసగా పదో రోజు కూడా కార్మికులు పట్టు వీడలేదు. డిమాండ్ల సాధన కోసం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట బైఠాయించారు. ఆర్టీసీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎవరూ భావోద్వేగాలకు గురై బలిదానాలకు పాల్పడవద్దని, పోరాడి సాధించుకుందామని కార్మికులు పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నవంబర్‌ 14న ఏపీలో ‘నాడు-నేడు’!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన ‘నాడు- నేడు’ కార్యక్రమాన్ని నవంబర్ 14న ప్రారంభించాలని భావిస్తోంది. వచ్చే నాలుగేళ్ళలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది రూ. 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. గ్యాస్‌ సిలిండర్‌ పేలి 10 మంది మృతి

యూపీలోని మొహ్మదాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మావూ జిల్లా మొహ్మదాబాద్‌ పరిధిలోని వలీద్‌పూర్‌లోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 10 మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రోడ్డు ప్రమాదంలో నలుగురు క్రీడాకారుల మృతి

మధ్యప్రదేశ్‌లోని రాయిసల్‌పూర్‌ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ‘ధ్యాన్‌చంద్‌ ట్రోఫీ’లో పాల్గొనేందుకు వీరంతా ఇటార్సీ నుంచి హోషంగాబాద్‌కు వెళ్తుండగా 69వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. అయోధ్యలో సెక్షన్‌ 144 విధింపు

‘రామజన్మభూమి-బాబ్రీమసీదు’ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ తుది దశకు చేరుకుంది. వారం రోజుల దసరా సెలవుల అనంతరం సోమవారం 38వ రోజు ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానం తిరిగి విచారణ ప్రారంభించనుంది. అతి సున్నితమైన ఈ కేసులో సుప్రీం విచారణ ముగుస్తుండటం..త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం అయోధ్యలో 144 సెక్షన్​ విధించారు. డిసెంబర్​ 10వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అదరగొట్టిన ఐఆర్‌సీటీసీ

రైల్వేలకు చెందిన ఆన్‌లైన్‌ టికెటింగ్‌, టూరిజం, కేటరింగ్‌ సంస్థ ఐఆర్‌సీటీసీ ఐపీవో లిస్టింగ్‌ నేటి నుంచి ప్రారంభమైంది. కాగా.. ట్రేడింగ్‌ ఆరంభంలోనే ఈ షేరు రికార్డు స్థాయిలో 101శాతం పెరిగి రూ. 644 ధరతో లిస్ట్‌ అవడం విశేషం. నిజానికి ఐఆర్‌సీటీసీ ఐపీవో షేరు ధర ప్రైస్‌ బ్యాండ్‌ను రూ. 315-320గా నిర్ణయించారు. రూ.320 ఇష్యూ ప్రైస్‌తో ఈ షేరు సోమవారం లిస్టింగ్‌కు వెళ్లగా.. బీఎస్‌ఈలో షేరు ధర ఒక దశలో 101.25శాతం పెరిగి రూ. 644 వద్ద లిస్ట్‌ అయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘అలా చేస్తే పాక్‌పై అణుబాంబు వేసినట్లే’

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఠానేలోని మీరా భయందర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి నరేంద్ర మెహతాకు మద్దతుగా భాజపా నేత, ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య  నిన్న రాత్రి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భాజపాకు ఓటేస్తే.. పాకిస్థాన్‌పై అణుబాంబు పడినట్లే. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. ప్రజల దేశభక్తికి ఈ ఫలితాలు అద్దంపడతాయి’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్‌ విడుదల

9. భారత కెప్టెన్‌కి మించి ఏదీ లేదు: గంగూలీ

టీమిండియా కెప్టెన్‌ బాధ్యలకు మించి ఏదీ లేదని మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం బంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న దాదా బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గంగూలీ పీటీఐతో మాట్లాడుతూ తానెప్పుడూ బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపడతానని అనుకోలేదన్నాడు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌పై దృష్టిసారిస్తానని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ఉదయం ఫ్లాట్‌గా మొదలైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం లాభాల్తో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 70.97గా ఉంది.  


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.