close

తాజా వార్తలు

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంపు

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల వేతనాన్ని రూ.8,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌  ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఒక్కో పంచాయతీలో ఒక్కో రకమైన వేతనం ఉండేది. ఈ నేపథ్యంలో తక్కువ వేతనాలు ఉన్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని పంచాయతీల్లో కార్మికులకు ఒకే రకమైన వేతనాలు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.