close

తాజా వార్తలు

పీఎఫ్‌ లేదు.. ఈఎస్‌ఐ రాదు

ఫార్మాసిటీలో దగా పడుతున్నకార్మికులు

గుత్తేదార్లు, యాజమాన్యాలు కుమ్మక్కు

5వేల మందికి తీవ్ర అన్యాయం

పర్యవేక్షణ పట్టని అధికారులు

 

 విశాఖకు చెందిన కార్మికుడు ఫార్మా కంపెనీలో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అతనికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ లేదని తేలింది. కుటుంబ సభ్యులకు పరిహారం, దహన సంస్కారాల సొమ్ము రాలేదు. భార్యకు ఉపాధి కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది.

● మరో ఫార్మా కంపెనీలో కుంచువానిపాలేనికి చెందిన కార్మికురాలు పని చేస్తూ మృతి చెందింది. ఆమెకు కూడా పీఎఫ్‌, ఈఎస్‌ఐ లేదు. ఆ కుటుంబం ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేని పరిస్థితి నెలకొంది.

● ఒడిశాకు చెందిన ఒప్పంద కార్మికుడు ఫార్మా కంపెనీలో మృతిచెందాడు. అతనికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ గుత్తేదారుడు చెల్లించలేదు.

అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో గుత్తేదారులు, కంపెనీల యాజమాన్య ప్రతినిధులు కుమ్మక్కై పీఎఫ్‌, ఈఎస్‌ఐ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ కార్మికుల కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగుల్చుతున్నారు.,...

ఫార్మాసిటీలో 215 మంది గుత్తేదార్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. చాలా మంది ఉప గుత్తేదార్లు కూడా ఉన్నారు. వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేవు. వీరు విశాఖతోపాటు పరిసర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమబంగా, బిహార్‌, ఝార్ఖండ్‌ తదితర ప్రాంతాల నుంచి చౌకగా లభించే కార్మికులను తెచ్చుకుని పనిచేయిస్తున్నారు. వీరిలో చాలా మందికి కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు. ప్రమాదవశాత్తు గాయపడినా, అనారోగ్యం కలిగినా వైద్యం అందడం లేదు. ఒకవేళ చనిపోతే ఆయా కుటుంబాలకు పరిహారం లభించడం లేదు.గ్రంథాలయం

పీఎఫ్‌ ప్రయోజనాలు ఇవీ..

● రూ.6500 జీతం పొందే ప్రతి కార్మికునికి పీఎఫ్‌ వర్తింపజేయాలి. అనారోగ్యానికి గురైనా, వివాహాల సమయంలో, గృహనిర్మాణాలు, పిల్లలు చదువుల నిమిత్తం పీఎఫ్‌ సొమ్మును తీసుకోవచ్ఛు

● కార్మికుని 10ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, 58ఏళ్ల వయస్సు దాటిన తర్వాత అతను చెల్లించిన పీఎఫ్‌ శాతాన్ని బట్టి పింఛను ఇస్తారు.

● ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే భార్య, ఇద్దరి పిల్లలకు పింఛను వస్తుంది. ప్రమాదంలో పూర్తి అంగవైకల్యానికి గురై 58ఏళ్లులోపు వయస్సు ఉంటే పింఛను వర్తిస్తుంది.

● సర్వీసులో ఉండగా మృతి చెందితే పీఎఫ్‌ నిల్వను బట్టి ఈడియల్‌ఐ కింద రూ.1.30లక్షలు చెల్లిస్తారు.
నిబంధనల ప్రకారం ఇలా..
నిబంధనల ప్రకారం ప్రతి ఫార్మా కంపెనీలో కార్మికుని పీఎఫ్‌, ఈఎస్‌ఐ పక్కాగా అమలు చేయాలి. కార్మికునికి వచ్చే జీతంలో 12 శాతం, గుత్తేదారుడు తన వాటా కింద 13 శాతం కలిపి పీఎఫ్‌ రూపంలో ప్రతినెల బోర్డుకు చెెల్లించాలి.

ఈఎస్‌ఐ కింద కార్మికుని వాటా రూ.1.75పైసలు, గుత్తేదారుడు తనవాటా రూ.4.75 కలిపి ఈఎస్‌ఐ బోర్డుకు కట్టాలి. వీటిని గుత్తేదారులు చెల్లిస్తున్నారా లేదా అని కంపెనీల యజమాన్యాలు, ఈఎస్‌ఐ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలి.

కార్మిక చట్టాలు అమలు చేస్తున్నట్లు నిర్థారణ అయిన తర్వాతే యాజమాన్యాలు...గుత్తేదారులకు నెలనెలా బిల్లులు చెల్లించాలి.

ఈఎస్‌ఐ వల్ల ఉపయోగాలు ఇవీ..

 ఈఎస్‌ఐ చట్టం ప్రకారం కంపెనీలో 10 మంది కార్మికులు ఉంటే ఈఎస్‌ఐ అమలు చేయాలి. కార్మిక కుటుంబమంతా ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అల్లోపతి, హోమియో, ఆయుర్వేద వైద్యం, మందులు పొందవచ్ఛు

● కార్మికునికి కనీసం 2ఏళ్ల సర్వీసు ఉండి పక్షవాతం, క్యాన్సర్‌, తదితర 32 వ్యాధుల్లో ఏది వచ్చినా 700 రోజుల వరకు 80శాతం జీతం చెల్లిస్తారు.

● కార్మికులు అనారోగ్యానికి గురైతే రోజు వేతనంలో నూటికి 60 శాతం చెల్లిస్తారు. అయితే దీనికి వైద్య ధ్రువపత్రాలు జతచేయాల్సి ఉంటుంది.

● పనిలో కార్మికునికి ప్రమాదం జరిగితే నెల వేతనంలో 90 శాతం పొందవచ్ఛు మృతి చెందితే అంత్యక్రియల నిమిత్తం రూ.10వేలు చెల్లిస్తారు. విధుల్లో ఉండగా మరణిస్తే భార్యకు జీవితాంతం జీతంలో 3/5వంతు చొప్పున, 25ఏళ్లలోపు పిల్లలకు 2/5వంతు చొప్పున పింఛను వర్తిస్తుంది.
అడిగితే తొలగిస్తున్నారు..
ఫార్మాసిటీలో పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలుకాని ఒప్పంద కార్మికులు 5వేల మందికి పైగా ఉంటారు. వీరంతా ఈఎస్‌ఐ వైద్యానికి సైతం నోచుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యంలో రోడ్డున పడుతున్నారు. ఎవరైనా కార్మికులు పీఎఫ్‌, ఈఎస్‌ఐ గురించి ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ఫార్మాసిటీలో పక్కాగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.

- గనిశెట్టి సత్యనారాయణ, ఫార్మాసిటీ స్టాప్‌, వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.