close

తాజా వార్తలు

మోదీ చిత్రపటంతో యువకుడి ప్రపంచ రికార్డు

బెంగళూరు: కర్ణాటకలో ఓ యువకుడు కాగితాలతో ప్రధాని మోదీ చిత్రపటాన్ని రూపొందించి ప్రపంచ రికార్డు సాధించాడు. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన కబడ తాలుకా నెల్యాడికి చెందిన పరీక్షిత్‌ నలుపు, తెలుపు రంగు కాగితాలు, ఓ బ్లేడు సాయంతో చూడచక్కని కళాఖండాలను తయారు చేస్తుంటాడు. అయితే ఇటీవల మూడు నిమిషాల 12సెకన్లలో కాగితాలతో మోదీ చిత్రపటాన్ని రూపొందించిన పరీక్షిత్‌ ‘ఎక్స్‌క్లూజివ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తుమకూరుకు చెందిన చందన్‌ సురేశ్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. ఫైర్‌ ఆర్ట్‌లో కూడా పరీక్షిత్‌ మంచి ప్రావీణ్యం ఉంది. ఇటీవల మైసూర్‌లో జరిగిన దసరా ఉత్సవాల్లోనూ ప్రదర్శన ఇచ్చాడు. మంగళూరు శక్తినగర్‌ డిజైన్‌ సెంటర్‌లోని ప్రముఖ చిత్రకారుడు గోపాద్కర్‌ వద్ద ఈ చిత్రకళను అభ్యసించాడు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.