close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ పర్యాటక బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధైర్యం చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా పదకొండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో కార్మికులు చేపట్టిన ఆందోళనకు భాజపా నేత లక్ష్మణ్‌ మద్దతిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం దసరా సెలవులను పెంచడమే కార్మికుల తొలి విజయమన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. గోదారి బోటు వెలికితీత పునఃప్రారంభం

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. నదిలో వరద ఉద్ధృతి తగ్గడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు సిద్ధమైంది. దీనికి అవసరమైన సామగ్రిని దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ నుంచి సంఘటన స్థలికి తరలించారు  ఇటీవల మూడు రోజుల పాటు  నదిలో లంగర్లువేసి బోటును వెలికితీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి అరెస్టు

తెలంగాణ విద్యా వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు టీపీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణను సైతం పోలీసులు అరెస్టు చేసి గద్వాల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాగ్‌ లింగంపల్లిలోని ప్రజాఫ్రంట్‌ కార్యాలయం వద్ద వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో కొద్ది మంది టీవీవీ విద్యార్థులను మావోయిస్టుల్లో చేర్పించారని మద్దిలేటిపై పోలీసులు ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. హిందూపురం రైల్వే ట్రాక్‌పై 4 మృతదేహాలు

అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 3 చోట్ల 4 మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిటిపి వద్ద రెండు, ములుగూరు వద్ద ఒకటి, దేవరపల్లి వద్ద మరో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పరిస్థితులు చేదాటుతున్నాయనే స్పందించా: కేకే

తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలతో సంప్రదింపుల విషయమై సీఎం కేసీఆర్ నన్ను ఇప్పటి వరకు పిలవలేదని తెరాస ముఖ్యనేత కేశవరావు అన్నారు. ఆర్టీసీ ఐకాస నేతలెవ్వరూ తనను కలవలేదని, ఒక వేళ సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిగా ఉంటానని కేకే తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇద్దరు కార్మికులు చనిపోయారనే బాధతోనే ‘ చర్చలకు సిద్ధం కావాలి’ అంటూస్టేట్మెంట్ ఇచ్చానన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేవలం ఒక సీనియర్ నాయకుడిగా మాత్రమే స్పందించానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. యాదాద్రి పునర్నిర్మాణ పనులతో భక్తుల ఇబ్బందులు

8. లిబ్రా విషయంలో ఫేస్‌బుక్ ముందడుగు‌..!

ఫేస్‌బుక్‌ కొత్త డిజిటల్‌ కరెన్సీ లిబ్రాను ప్రారంభించేందుకు ముందడుగు వేసింది. ఇప్పటికే చాలా విమర్శలు వచ్చినప్పటికీ ఫేస్‌బుక్‌ దీనిని కొనసాగించింది. ప్రస్తుతం ఉబర్‌, ఎల్‌వైఎఫ్టీ, స్పాటిఫై, వొడాఫోన్‌ వంటి దిగ్గజాలు కూడా ఇందులో కొనసాగుతున్నాయి. మరో 180 కంపెనీలు కూడా దీనిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు లిబ్రా వర్గాలు వెల్లడించాయి. సోమవారం ఐదుగురు సభ్యులను ఎన్నుకొని బోర్డును ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ప్రమాదపుటంచులకు పాక్‌..!

ఉ్రగవాదులపై చర్యల విషయంలో కపట నీతిని ప్రదర్శిస్తున్న పాకిస్థాన్‌ పరిస్థితి ప్రమాదపుటంచులకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌పై కఠిన చర్యలకు పూనుకుందని సమాచారం. మొత్తం 27 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికలో కేవలం ఆరింటిలో మాత్రమే పురోగతి సాధించిందని దీంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఈ క్రమంలో చివరి అవకాశంగా పాక్‌ను ‘డార్క్‌ గ్రే లిస్ట్‌’లో చేర్చే అవకాశం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆ దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తాం: ట్రంప్‌

సిరియాలో కుర్దుల ఆధీనంలో ఉన్న ఈశాన్య ప్రాంతాలపై సైనిక దాడికి పాల్పడుతున్న టర్కీపై కఠిన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రకటించారు. అందులో భాగంగా స్టీల్‌పై సుంకాలు పెంచనున్నట్లు, 100బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలకు స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. ‘‘విధ్వంసక మార్గాన్ని కొనసాగిస్తే టర్కీ ఆర్థిక వ్యవస్థలకు అత్యంత వేగంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.