close

తాజా వార్తలు

బంగారాన్ని పేస్టుగా మార్చి.. జీన్స్‌లో దాచి

హైదరాబాద్‌ :  శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలోకుపైగా బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద 653 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టుగా మార్చి ప్రత్యేకంగా కుట్టించిన జీన్స్‌లో దాచి ప్రయాణికుడు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడితోపాటు ఆ బంగారాన్ని  తీసుకోవడానికి వచ్చిన వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బంగారం విలువ రూ.24 లక్షలకుపైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.