close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డుప్రమాదం

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా ప్రావిన్స్‌లోని అల్‌ అఖల్‌ సెంటర్‌ వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు.. భారీ వాహనాన్ని(ప్రోక్లెయినర్‌) ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను అల్‌ హమ్నా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆర్టీసీ సంఘాలతో చర్చల్లేవ్‌: కేసీఆర్‌

సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు సంస్థ రూ.150 కోట్ల  ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచితంగా సమ్మెకు వెళ్లాయని, ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వెంటనే ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, మరిన్ని బస్సులు అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నిరాధార కథనాలు రాస్తే కేసులు

ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చేలా పత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక, అవాస్తవ, నిరాధార కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాంటి కథనాలు రాసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలపై న్యాయపరంగా చర్యలు చేపట్టేందుకు, ప్రాసిక్యూషన్‌కి వెళ్లేందుకు సంబంధిత ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు అధికారం కట్టబెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నేడు కేసీఆర్‌ ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హుజూర్‌నగర్‌లో గురువారం ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హుజూర్‌నగర్‌ గుట్ట సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. కేసీఆర్‌ చివరిసారిగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్‌ 8న వికారాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఏపీలో రూ. 700 కోట్ల పెట్టుబడులు

ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హాంకాంగ్‌కు చెందిన ‘ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌’ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పాదరక్షల తయారీ కోసం ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుపై  సీఎంతో చర్చించారు. ఇందుకు రూ.700 కోట్లు ఖర్చవుతుందని, సుమారు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కొలువుల భర్తీకి ప్రకటన

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) 3025 పోస్టుల భర్తీకి 3 వేర్వేరు ప్రకటనలను బుధవారం విడుదల చేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌) పోస్టులు 2500, జూనియర్‌ అసిస్టెంటు(జేఏ) కం కంప్యూటర్‌ ఆపరేటర్‌ 500,   జూనియర్‌ పర్సనల్‌ అధికారి(జేపీపీ) 25 పోస్టులకు ఈ ప్రకటనలు జారీచేసింది. గతంలో ఈ పోస్టులకు వయో పరిమితి 44 ఏళ్లుండగా తాజా ప్రకటనల్లో తగ్గించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఫోనుంటే.. పిన్‌తో పనేంటి

షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా.. బంకులో పెట్రోలు కొట్టించినా ప్రతిసారీ చెల్లింపులకు క్రెడిట్‌ కార్డు వెంట తీసుకొని వెళ్లాల్సి వస్తోందా? మాటిమాటికి పిన్‌ నెంబరుతోనూ పనిపడుతోందా? అయితే ఎస్‌బీఐ కార్డు మీ చెంత ఉంటే పిన్‌ అవసరం లేదు. ఎస్‌బీఐ కార్డ్‌ అందుబాటులోకి తెచ్చిన ‘ఎస్‌బీఐ కార్డు పే’తో మొబైల్‌ ఫోను ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఇందుకు ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మీ కార్డును రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బజాజ్‌ విద్యుత్‌ చేతక్‌

బజాజ్‌ ‘చేతక్‌’ బ్రాండు పునరాగమనం చేస్తోంది. అయితే ఈసారి భిన్నంగా.. విద్యుత్‌ స్కూటర్ల రూపంలో. జనవరి నుంచి ‘చేతక్‌’ బ్రాండుపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించేందుకు యోచిస్తున్నట్లు బజాజ్‌ ఆటో ప్రకటించింది. తొలుత పుణెలో.. ఆ తర్వాత బెంగళూర్‌లో అందుబాటులోకి తేనుంది. ధర ఎంత ఉంటుందో బజాజ్‌ చెప్పనప్పటికీ.. రూ.1.5 లక్షల మించబోదని అంటోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. జాబిల్లి, అంగారకుడిపై సాగు సాధ్యమే!

జాబిల్లి, అంగారకుడిపై భవిష్యత్తులో మానవులు స్థావరం ఏర్పాటుచేసుకుంటే, వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అక్కడే పండించుకోవచ్చు! ఆ రెండింటి మట్టి కొన్ని పంటల సాగుకు అనుకూలంగా ఉందని నెదర్లాండ్స్‌లోని వేజ్‌నింజన్‌ పరిశోధక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. అచ్చం అంగారకుడు, చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి తరహా నమూనాల్లో టమాటా, ముల్లంగి, మెంతి, పాలకూర, బఠానీ వంటి పది రకాల పంటలను వారు ప్రయోగాత్మకంగా పండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కుర్రాడి ఖలేజా

దేశవాళీ క్రికెట్లో ముంబయి కుర్రాడు యశస్వి జైశ్వాల్‌ సంచలనాలు కొనసాగుతున్నాయి. వివిధ వయసు విభాగాల మ్యాచ్‌ల్లో ఇప్పటికే చక్కటి ప్రదర్శన చేసిన యశస్వి.. ఇప్పుడు సీనియర్‌ స్థాయిలోనూ అదరగొడుతున్నాడు. 17 ఏళ్ల ఈ కుర్రాడు విజయ్‌ హజారె వన్డే ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాది ఔరా అనిపించాడు. లిస్ట్‌-ఎ క్రికెట్లో డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.