close

తాజా వార్తలు

నటి కుమారుడికి మోదీ ఆశీస్సులు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటి గుల్‌ పనాగ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఒక వీడియోపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. పనాగ్‌ ఇటీవల తన కుమారుడు నిహాల్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని కొన్ని పుస్తకాలు చూపిస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అందులో ఆమె కుమారుడు ఆ పుస్తకాలపై ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని గుర్తించి తల్లితో పాటు మోదీజీ అని పలుకుతుంటాడు. దీంతో ఆమె ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ నిహాల్‌ ఇప్పుడు మోదీని గుర్తించగలిగాడు అని పేర్కొంటూ మోదీకి ట్యాగ్‌ చేశారు. ఆ వీడియో చూసిన అనంతరం ప్రధాని మోదీ.. పనాగ్‌ ట్వీట్‌కు స్పందించారు. ‘చాలా బాగుంది.. నిహాల్‌కు నా ఆశీస్సులు తెలియజేయండి. భవిష్యత్తులో అతడు అనుకున్న విధంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.