close

తాజా వార్తలు

తగిన వరుణ్ని ఇవ్వలేదుగా.. 50 వేలు ఇవ్వండి


చండీగఢ్‌ : తన కూతురుకి తగిన వరుడిని వెతికిపెట్టనందుకు ఓ తండ్రి మ్యాట్రిమోనీ సంస్థపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఆ ఫోరం కూడా తండ్రికి అనుకూలంగా తీర్పు చేప్పింది. రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 

మొహాలికి చెందిన సురీందర్‌ పాల్‌ సింగ్‌ చాహల్‌  హరియాణలో వైద్యురాలిగా పని చేస్తున్న తన కుమార్తెకు తగిన వరుణ్ని చూడాల్సిందిగా ఓ మ్యాట్రిమోనీని సంప్రదించారు. అయితే 9 నెలలు కావస్తున్నప్పటికీ ఆ సంస్థ తగిన వ్యక్తిని ఎంపిక చేయకపోవడంతో విసుగు చెందిన సురీందర్‌.. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరాన్ని ఆశ్రయించారు. ముందుగా రాసుకున్న ఒప్పందం ప్రకారం తనకు పరిహారం చెల్లించాలని కోరారు. ఒప్పంద పత్రాలను పరిశీలించిన ఫోరం..  ఫిర్యాదుదారుడికి మ్యాట్రిమోని సంస్థ 9 శాతం వడ్డీతో కలిపి రూ.50 వేలను చెల్లించాలని ఆదేశించింది. వీటితోపాటు ఇప్పటి వరకు అయిన ఖర్చుల మొత్తం రూ.12 వేలను కూడా తండ్రికి చెల్లించాలని పేర్కొంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.