close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. సర్జరీ తర్వాత నెలకు రూ.5వేలు: జగన్‌

ఈ ఏడాది నవంబర్‌ 1 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లోని 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. జనవరిలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలని సీఎం సూచించారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కోలుకునేంత వరకూ నెలకు రూ.5వేలు లేదా రోజుకు రూ.225  చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జగన్‌ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు: కేటీఆర్‌

ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 13లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ‘మ్యాన్‌ ఎక్స్‌-2019’ పేరిట జరిగిన మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఎక్సలెన్స్‌ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న ఆలోచనతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని కేటీఆర్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌ కంటే వైఎస్సార్‌ బెటర్‌: చంద్రబాబు

జగన్‌ కంటే ఆయన తండ్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వెయ్యిరెట్లు ఉత్తమమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డికి పట్టు విడుపులు ఉన్నప్పటికీ హుందాతనం ఉండేదని, ఎవరైనా తప్పని చెబితే విని వెనక్కి తగ్గేవారన్నారు. ప్రతిశుక్రవారం అవినీతి కేసులో కోర్టు బోనులో నిలబడే వ్యక్తి మమ్మల్ని అవినీతి అనటం విడ్డూరమని విమర్శించారు. నియంతలా వ్యవహరించిన వాళ్లు కాలగర్భంలో కలిసి పోయారని చంద్రబాబు గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీని కాపాడుకునేందుకు ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేలా యాజమాన్యం ప్రయత్నించిందని ఆరోపించారు.  వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని న్యాయస్థానం సూచించిందని, యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మరో పోరాటానికి తెదేపా సిద్ధం: వర్ల

ఇసుక కొరతపై మరోసారి ఆందోళనకు తెదేపా సిద్ధమైందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇసుక కొరతపై ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.  భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆందోళనల్లో భాగంగా అన్ని ప్రాంతాల్లో తెదేపా నేతలు సామూహిక నిరాహార దీక్షలు చేస్తారని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అభిజిత్‌వి వామపక్ష భావాలు: గోయెల్‌

అర్థశాస్త్రంలో నోబెల్‌ సాధించిన అభిజిత్ బెనర్జీ అనుసరిస్తున్న విధానాలన్నీ వామపక్ష భావజాలంతో కూడుకున్నవని.. భారతదేశ ప్రజలు ఆయన విధానాలను తిరస్కరించారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. ‘అభిజిత్ బెనర్జీ నోబెల్‌ బహుమతి సాధించారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను. ఆయన ఆలోచనలు, అనుసరిస్తున్న విధానాలన్నీ వామపక్ష భావజాలంతో ఉన్నాయి. దేశ ప్రజలు ఆయన ఆలోచనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అభిజిత్ బెనర్జీ నోబెల్‌ బహుమతి పొందడం ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను’ అని గోయెల్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వయోధికుల వాక్‌థాన్‌

8. భారత్‌, చైనాలను అలా పరిగణించొద్దు: ట్రంప్‌

భారత్‌, చైనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను కోరారు. ఎందుకంటే ఆ దేశాలు అమెరికాపై సుంకాలు పెంచి ముందుకెళ్తున్నాయని లేఖ రాశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆ రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా గుర్తించినప్పటి నుంచి ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని అన్నారు. ‘‘ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నతమైంది. చైనా, భారత్‌లను ఆ సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించి మేం ఆ సంస్థకు లేఖ రాశాం’’ అని విలేకరులతో అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాంచీ టెస్టుకు అమ్ముడైంది 1500 టికెట్లే!

రాంచీ వేదికగా ప్రారంభంకానున్న భారత్‌×దక్షిణాఫ్రికా మూడో టెస్టుకు కేవలం 1500 లోపే టికెట్లు అమ్ముడయ్యాయి. 39వేల సీట్ల సామర్థ్యమున్న జేఎస్‌సీఏ స్టేడియంలో టెస్టు మ్యాచ్‌ నిర్వహించడం ఇది రెండో సారి. దీనిలో 5వేల టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌గా అందివ్వనున్నారు. పారామిలిటరీ, ఆర్మీ, స్థానిక పోలీసులు, ఎన్‌సీసీ వారికి ఉచితంగా టికెట్లు ఇవ్వనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యూపీలో ఎన్నికల ప్రచారంలో ఇంద్రజాల ప్రదర్శన 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.