close

తాజా వార్తలు

కళాశాలల్లో సెల్‌ఫోన్స్‌ వాడకంపై నిషేధం!

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన శైలిలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఇకపై విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సెల్‌ఫోన్లు వాడకూడదు. కేవలం విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందనుకుంటే పొరపాటే. వారితో పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి కూడా ఈ నిషేధం వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వారికి మెరుగైన బోధనా వాతావరణం కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ అధికారిక సమావేశాలు, మంత్రివర్గ సమావేశాల్లో మొబైల్‌ ఫోన్ల వాడకాన్ని ఇప్పటికే ఆధిత్యనాథ్‌ నిషేధించిన విషయం తెలిసిందే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.