close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడులు

పాకిస్థాన్‌ సైన్యం సాయంతో భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. తంగ్ధార్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్‌ బలగాలు శతఘ్నులతో విరుచుకుపడ్డాయి.ఈ ఘటనలో నలుగురైదుగురు పాక్‌ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వం దమనకాండను ఆపాలి: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం దమనకాండను ఆపాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. వంద మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులను అరెస్టు చేశారని, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావుపైనా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె భవిష్యత్‌ కార్యాచరణ, ప్రభుత్వం తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్షం, ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. త్వరలో విశాఖలో పవన్‌ భారీ ర్యాలీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నవంబర్‌ 3న ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఉపాధి లభించక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై ఈ ర్యాలీ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు దీన్ని ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేసీఆర్‌ను జైలుకు పంపేవరకు పోరాడుతా:నాగం

సీఎం కేసీఆర్‌ తెలంగాణను దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను జైలుకు పంపేవరకు ఆయన అవినీతిపై తాను పోరాటం చేస్తానని నాగం చెప్పారు. రూ.24వేల కోట్ల విలువైన బీటీ రహదారుల కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు కట్టబెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తణుకులో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మల్లికాసులపేటలో మంటలు చెలరేగి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.

6. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌తోవోల్వో తొలి ఎలక్ట్రిక్‌ కారు

స్వీడన్‌కు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల సంస్థ వోల్వో.. తన తొలి ఎలక్ట్రిక్‌ కారు  ‘ఎక్స్‌సీ-40 రీఛార్జ్‌’ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను వెల్లడించింది. ఇదే సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్‌ కారు. కాంపాక్ట్‌ మాడ్యూలర్‌ ఆర్కిటెక్చర్‌ ఫ్లాట్‌ఫాంపై దీన్ని నిర్మించారు. ఇది ఎక్స్‌సీ-40 ఎస్‌యూవీ డీజిల్ ఇంజిన్‌ మోడల్‌ని పోలి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఆ కంపెనీలనుఆహ్వానించేందుకు బ్లూప్రింట్‌’

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అనేక కంపెనీలు చైనా సహా మరికొన్ని ప్రాంతాల నుంచి తరలిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలను భారత్‌కు ఆహ్వానించేందుకు బ్లూప్రింట్‌ తయారుచేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం వెల్లడించారు. ఆ మేరకు ఆయా సంస్థలతో సమావేశమై చర్చలు జరుపుతామన్నారు. భారత్‌లో ఉన్న సౌకర్యాలు, వసతుల గురించి వారికి వివరిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుటుంబానికి చెందిన సొంత గోల్ఫ్‌ రిసార్టులో జీ-7 దేశాధినేతల సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రతిపక్షాలు, మీడియాలో తీవ్ర విమర్శలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. వేరే వేదికలతో పోలిస్తే తన కుటుంబానికి చెందిన రిసార్టులో తక్కువ ఖర్చు అవుతుందని.. ఆ విధంగా ప్రభుత్వానికి మేలు చేద్దామని భావించానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రోహిత్‌ డబుల్.. సఫారీసేన ట్రబుల్‌

టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్‌ శర్మ (212; 255 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా అజింక్య రహానె (115) శతకంతో, రవీంద్ర జడేజా (51) అర్ధశతకంతో మెరవగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 497/9 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను భారత పేసర్లు షమి (1/0), ఉమేశ్‌ యాదవ్‌ (4/1) బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్‌ ఆరంభమైన తొలి రెండు ఓవర్లలోనే  రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి తొమ్మిది పరుగులు చేసి కష్టాల్లో పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నలుగురు కవలలకు జన్మనిచ్చిన 40ఏళ్ల మహిళ


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.