close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. హుజూర్‌నగర్‌లో కొనసాగుతున్న పోలింగ్‌

రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా, నాయకులకు సవాల్‌గా మారిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 302 కేంద్రాల్లో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ముగ్గురు మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు మహారాష్ట్ర, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గానూ 3,237 మంది అభ్యర్థులు.. హరియాణాలోని 90 స్థానాలకు గానూ 1,169 మంది పోటీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఎల్బీనగర్‌ షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి సహాయ చర్యలు ప్రారంభించారు. చికిత్స పొందుతున్న రోగులను ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి కాపాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేటి నుంచి పాఠశాలలు

దసరా పండుగ సెలవుల తరువాత తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. గత సోమవారం (ఈ నెల 14) నుంచే విద్యా సంస్థలు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం సెలవులను వారం పొడిగించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పాఠశాల విద్యలో కే12 విధానం

ఏపీ పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయనున్నారు. విలీన అనంతరం ఇంటర్‌ను సీనియర్‌ సెకండరీ విద్యగా పరిగణిస్తారు. విద్యలో సంస్కరణలకు బాలకృష్ణన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఆదివారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడంపై చర్చించారు. పాఠశాల విద్యలో కే12 విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఖైదీలకు కల్తీ నూనె!

తెలంగాణ జైళ్ల శాఖలో సరికొత్త కుంభకోణం బహిర్గతమైంది. ఖైదీల ఆహారం కోసం వినియోగించేందుకు శుద్ధి (రిఫైండ్‌) చేసిన సన్‌ఫ్లవర్‌ నూనెకు బదులు పామోలిన్‌తో కూడిన కల్తీ నూనె సరఫరా చేసినట్లు వెల్లడైంది. ఇది ఆరోగ్యానికి హానికరమని తేలడంతో జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైల్‌లో జరిగిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. డిసెంబరులో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

మాతృభాష పరిరక్షణకు తెలుగు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించనున్నట్లు మహాసభల కార్యదర్శి జి.వి.పూర్ణచందు తెలిపారు. డిసెంబరు 27, 28, 29 తేదీల్లో విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియం వేదికగా ఈ సభలు జరుగనున్నాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. టోల్‌ సేవలున్నాయ్‌

జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సత్వరం స్పందించే విధంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అనేక ఏర్పాట్లు చేసింది. టోల్‌ ప్లాజా వద్ద రుసుం కట్టాక ఇచ్చే రశీదు వెనుక ఆయా సేవలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. అంబులెన్స్‌ టోల్‌ఫ్రీ నంబరు గత ఏడాది నుంచే ఉండగా.. తాజాగా హెల్ప్‌లైన్‌ నంబర్‌, క్రేన్‌ నంబర్‌, రోడ్‌ పెట్రోల్‌ వెహికల్‌ నంబర్‌లను ముద్రిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మెట్రోనగరాల్లో ఇళ్ల వద్దకే డీజిల్‌

మెట్రో నగరాల్లో వాహనదారులు పెట్రోల్‌ బంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గృహ సముదాయాల్లోని ఇళ్ల వద్దకే డీజిల్‌ను తీసుకువెళ్లి అందించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందుకోసం పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్స్‌ భద్రతా విభాగం (పీఈఎస్‌ఓ)తో చేస్తున్న సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయి. మెట్రో నగరాల్లో 2020 జనవరి నుంచి ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఇ కామర్స్‌ పోర్టళ్లకు నోటీసులు

పండుగ విక్రయాల్లో దూసుకెళ్తున్న ఇ-కామర్స్‌ పోర్టళ్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు పారిశ్రామిక ప్రోత్సాహకం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నుంచి నోటీసులు వెళ్లాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను ఈ సంస్థలు ఉల్లంఘిస్తున్నాయని, భారీ రాయితీలు ఇస్తూ, సంప్రదాయ దుకాణాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తూ, వ్యాపారుల సంఘం సీఏఐటీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నోటీసులు వెళ్లాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఏకబిగిన 19 గంటల విమాన ప్రయాణం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.