close

తాజా వార్తలు

దిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్‌

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ బయల్దేరి వెళ్లారు.విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో జరిగే పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన హస్తినకు పనమయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు దిల్లీలోని జన్‌పథ్-1కు చేరుకొని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. ఇంధనశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌, పెట్రోలియం, ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ‌,కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ లతోపాటు మరికొందరు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. పోలవరం రివర్స్‌టెండరింగ్‌, పనులు నిలుపుదల వంటి అంశాలపై  మంత్రి గజేంద్రసింగ్‌తో చర్చించే అవకాశముంది. సోమవారం రాత్రి దిల్లీలోనే బస చేయనున్న జగన్‌.. మంగళవారం సాయంత్రం దిల్లీ నుంచి బయల్దేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ విందుకు హాజరవుతారు. అక్కడి నుంచి విజయవాడకు పయనమవుతారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.