close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. రూ.230కోట్లు కావాలి..ఉన్నది రూ.7.5 కోట్లే!

కార్మికుల వేతనాల చెల్లింపునకు అవసరమైన నిధులు తమ వద్ద లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. జీతాల కోసం రూ.230 కోట్లు అవసరమని.. ప్రస్తుతం తమ వద్ద ఉన్నది రూ.7.5 కోట్లు మాత్రమేనని వివరించింది. కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని పేర్కొంది. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది.  కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ వారి ప్రాథమిక హక్కులకు ఆర్టీసీ యాజమాన్యం భంగం కలిస్తోందంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎంజీబీఎస్‌ ఎదుట అఖిలపక్ష నేతల ధర్నా

తెలంగాణ ఆర్టీసీ ఐకాస సమ్మె వరుసగా 17వ రోజు కొనసాగుతోంది. సమ్మెకు మద్దతుగా  ఆర్టీసీ ఐకాస నేతలు, కార్మికులతోపాటు అఖిలపక్ష నేతలు చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం, వి.హనుమంతరావు తదితరులు హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్‌ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మమ్మల్ని విమర్శించి మీరేం చేశారు?

తెదేపా హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తామంటే వైకాపా నేతలు విమర్శలు చేశారని కానీ ఈ రోజు ఇసుక కొరతను తీర్చే పరిస్థితుల్లో లేరని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.  రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ‘‘మా హయంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని విమర్శలు చేశారు. నేను చాలా సున్నితంగా ఆలోచించి అంతా గొడవెందుకని ఇసుకను ఉచితంగా ఇచ్చాం. అయినా మళ్లీ విమర్శలు చేశారు. మమ్మల్ని విమర్శించి మీరేం చేశారు?’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు..!

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయినట్లు సమాచారం. నవంబరు 18న ప్రారంభమై డిసెంబరు 13వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు షెడ్యూల్‌ పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు ఆర్డినెన్స్‌లు సైతం సభ ముందుకు రానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇన్ఫోసిస్‌ సీఈఓపై ఆరోపణలు..!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు చెందిన సీఈవో సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్‌ అనైతిక పద్ధతులను అవలంబించినట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తుతెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు సెప్టెంబరు 20న రాసిన లేఖ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు లభించింది. ‘‘పరేఖ్‌, రాయ్‌ అనేక త్రైమాసికాలుగా అనైతిక పద్ధతులను అవలంబిస్తున్నారు. దానికి సంబంధించి ఈమెయిల్‌, వాయిస్‌ రికార్డింగ్‌ రూపంలో ఆధారాలు ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పోలీసు అమర వీరులకు కేసీఆర్‌ నివాళి

శాంతి భద్రతల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోలీసులు పని చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొనియాడారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఘ వ్యతిరేక శక్తులను అదుపుచేసే క్రమంలో పోలీసులు ప్రాణాలర్పిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు ఎప్పటికీ అమరులుగా ఉంటారని సీఎం వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘రివర్స్‌ టెండరింగ్‌తో రూ.1000కోట్ల ఆదాయం’

రివర్స్‌ టెండరింగ్‌తో  జలవనరుల శాఖలో ఇప్పటివరకు రూ.1000 కోట్ల ఆదాయం తెచ్చామని మంత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌ తీసుకురాకపోతే ఈ మొత్తంమంతా కొంతమంది జేబుల్లోకి వెళ్లేదని ఆరోపించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేపడుతుంటే తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారనీ.. నిరంతరం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బోటు పైకప్పు వెలికితీత

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరినదిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీతలో పురోగతి సాధించారు. సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో కొంత పురోగతి సాధించారు. మరికొద్ది సేపట్లో బోటును పూర్తిగా వెలికితీయవచ్చని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తేజస్‌ రైలు ఆలస్యం ఖరీదు రూ.1.62లక్షలు

తేజస్‌ రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామన్న ఐఆర్‌సీటీసీ.. మాటను నిలబెట్టుకోనుంది. అక్టోబర్‌ 19న రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో 950మంది ప్రయాణికులకు రూ.1.62లక్షల పరిహారం ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అందించనున్నాయనమని అధికారులు వెల్లడించారు. రైళ్లు ఆలస్యమైతే పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే మొదటిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇమ్రాన్ హయాంలో ప్రజల్లో అసంతృప్తి: బిలావల్

ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ(పీపీపీ) ఛైర్మన్‌ బిలావల్‌ బుట్టో జర్దారీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని  తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలతో పాటు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన మీడియాతో వెల్లడించినట్లు సమాచారం. ఆదివారం జిన్నా మెడికల్ పీజీ కళాశాలను సందర్శించిన బిలావల్‌ మీడియాతో మాట్లాడారు. మీడియా వర్గాల సమాచారం మేరకు.. ఇమ్రాన్‌ఖాన్‌కు తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యం లేదని బిలావల్‌ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంత అణచివేత ఎప్పుడూ లేదు: మల్లు రవి

ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతల అరెస్టులను ఖండిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని జైలులా మార్చారని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ఇంత అణచివేత ధోరణి గతంలో ఎన్నడూ లేదని.. ఇది ప్రజాస్వామ్య పాలన కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి వల్లే కాంగ్రెస్‌ పార్టీ ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.