close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో ఉన్న  జగన్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న నిధులు, సమస్యలతో అమిత్‌షాతో చర్చించినట్లు సమాచారం. అమిత్‌షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో జగన్‌ సమావేశం కానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అద్దె బస్సుల టెండర్లపై హైకోర్టులో పిటిషన్‌

తెలంగాణలో అద్దె బస్సుల టెండర్లను సవాల్‌ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖచేసింది. దీనిపై సింగిల్‌ జడ్జి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్టీసీకి బోర్డు అనుమతి లేకుండానే ఇన్‌ఛార్జి ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ వాదించారు. సమ్మెను ఓ కొలిక్కి తీసుకురాకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ..అర్టీసీ సొంత బస్సులు నడిపే స్థితిలో లేదని అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తా, ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. ఇవాళ చిత్తూరు, అనంతపురం, నెల్లూరు,  ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. బుధ, గురువారాల్లోనూ కోస్తా, ఉత్తారాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేను ఎక్కడికీ పారిపోలేదు: కల్కి భగవాన్‌

ఆధ్యాత్మిక గురువు కల్కిభగవాన్‌ విదేశాలకు వెళ్లిపోయారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆయన స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, చెన్నైలోనే ఉన్నానని ఓ వీడియో సందేశం ద్వారా స్పష్టం చేశారు. ‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. విదేశాలకు పారిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఎక్కడికీ వెళ్లలేదు. చెన్నై ‘నేమం’లోనే ఉంటున్నా. ఎప్పటిలాగే ఆశ్రమంలో బోధనా కార్యక్రమాలు జరుగుతాయి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటాం’ అని కల్కి భగవాన్‌ ఆ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం రానుంది. రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌, గ్రేటర్‌ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు.  దీంతో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీబీఐ కేసులో చిదంబరానికి బెయిల్‌

ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఇతర కేసుల్లో అరెస్టు కాని పక్షంలో ఆయన్ని రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని కోర్టు తెలిపింది. అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. అయితే ఇదే ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంలో ప్రస్తుతం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌ చేతిలో సఫారీలు వైట్‌వాష్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సఫారీసేను టీమ్‌ఇండియా 3-0తో వైట్‌వాష్‌ చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సఫారీసేన రెండు ఓవర్లలోనే ఆలౌటైంది. నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో సఫారీసేన రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సీఈవోపై ఆరోపణలు.. కుప్పకూలిన ఇన్ఫీ షేర్లు

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ప్రధాన అధికారులపై ఆరోపణలు కంపెనీ షేర్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేర్లు మంగళవారం కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్‌లో ఇన్ఫీ షేరు ధర ఒక దశలో 16శాతానికి పైగా పతనమైంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో 10శాతం నష్టంతో మొదలైన షేరు ధర ఒక దశలో 15.94శాతం విలువ కోల్పోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే ట్రేడవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అధ్యక్షుడి హోదాలో కోహ్లీతో చర్చిస్తా

బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత సారథి కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతడి ఇష్టమని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గంగూలీ పేర్కొన్నాడు. వచ్చేనెలలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో భారత్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే, విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న కోహ్లీ ఈ టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దాదా స్పందించాడు. ‘అక్టోబర్‌ 24న కోహ్లీతో చర్చిస్తా. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో టీమ్‌ఇండియా కెప్టెన్‌తో మాట్లాడతా’ అని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాచకొండ గుట్టల్లో ఆకట్టుకుంటున్న జలపాతాలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.